Telugu Current Affairs One Liners 15 May 2018

Telugu Current Affairs One Liners 15 May 2018

Telugu Current Affairs One Liners 15 May 2018




?అత్యున్నత ఎవరెస్ట్‌ పర్వతంపై రికార్డుల మోత మొదలైంది. రెండు కాళ్లూలేని 69 ఏళ్ల చైనావాసి షియా బోయు ఎట్టకేలకు నాలుగు దశాబ్దాల నాటి(తొలి ప్రయత్నం 1975లో) లక్ష్యాన్ని పూర్తిచేశారు.
?సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు డా॥ బిందేశ్వర్‌ పాఠక్‌కు నిక్కీ ఆసియా పురస్కారం లభించింది
?ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానాన్ని 2022 కల్లా సిద్ధం చేయాలని చైనా నిర్ణయించింది.
?శ్రీలంకలో 4 రోజుల పర్యటనలో భాగంగా ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ 2018 మే 14న కొలంబోలో ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమసింఘేతో సమావేశమై సైనిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.
?ఇండియన్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ICSE) 10వ తరగతి పరీక్షల్లో 15 మంది విద్యార్థులు 99 శాతానికిపైగా మార్కులు సంపాదించారు.
?ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 9వ షెడ్యూులుకు చెందిన 77 ప్రభుత్వరంగ సంస్థల్లో విభజన పూర్తయిందని, మరో 24 సంస్థల ప్రక్రియ మిగిలిపోయిందని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు సమాచారం పంపింది
?ఉత్తర కొరియా చివరిసారిగా 2017లో నిర్వహించిన అణు పరీక్ష చాలా శక్తిమంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
?వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా పరిమితిని రూ.లక్ష నుంచి రూ.15 లక్షలకు పెంచాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 మే 14న లేఖ రాశారు
?కేంద్ర కేబినెట్‌లో 2018 మే 14న స్వల్ప మార్పులు జరిగాయి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యత నుంచి స్మృతి ఇరానీని తప్పించారు. ఇప్పటివరకూ అదే శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్‌ రాథోడ్‌కే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు
?రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి గాను రూ.106.83 కోట్లను మంజూరు చేసింది
?తెలంగాణలో విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2% రిజర్వేషన్లను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 14న ఉత్తర్వులు జారీ చేసింది.