Telugu Current Affairs One Liners 16 June 2018

Telugu Current Affairs One Liners 16 June 2018

Telugu Current Affairs One Liners 16 June 2018

పుదుచ్చేరి డీజీపీగా ఎస్‌.సుందరి నంద నియమితులయ్యారు.దీంతో పుదుచ్చేరి డీజీపీగా నియమితులైన మొట్టమొదటి మహిళా సుందరి నంద ఘనత సాధించారు
23వ యురోపియన్‌ యూనియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను 2018 జూన్‌ 18 నుంచి 24 వరకు న్యూడిల్లీలో నిర్వహించనున్నారు
ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంపద వేగంగా వృద్ధి చెందుతోంది.
గతేడాది అంతర్జాతీయంగా వ్యక్తిగత సంపద 201.9 లక్షల కోట్ల డాలర్లుకు చేరింది.2016తో పోలిస్తే ఇది 12 శాతం అధికం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొటాన్‌ ఢీ యంత్రం లార్జ్‌ హాడ్రన్‌ కొలైడర్‌ (LHC)కి ఆధునికీకరించే పని 2018 జూన్‌ 15న ప్రారంభమైంది
స్టీఫెన్‌ హాకింగ్‌ స్వరానికి వినసొంపైన ఆరున్నర నిముషాల సంగీతాన్ని మేళవించి, దాన్ని స్పెయిన్‌లోని ఏంటెన్నా ద్వారా అంతరిక్షంలోని ‘1ఎ 0620-00’ కృష్ణబిలానికి పంపించారు
చెన్నైకి చెందిన రాజా విజయరామన్‌కు యాపిల్‌ డిజైన్‌ అవార్డు లభించింది
HIVని శరీరం నుంచి తరిమేసే సరికొత్త యాంటీబాడీలను హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు
తెలంగాణ పోరాటయోధుడు, సీనియర్‌ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వరరావు(79) 2018 జూన్‌ 15న హైదరాబాద్‌లో మృతి చెందారు
తేలికపాటి యుద్ధ విమానం- తేజస్‌(వాయుసేన 45వ స్క్వాడ్రన్‌) విభాగం ఇకపై తమిళనాడులోని వాయుసేన స్థావరం సూలూరు కేంద్రంగా సేవలందించనుంది
రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం కోదండరామయ్య(92) 2018 జూన్‌ 15న హైదరాబాద్‌లో మృతి చెందారు
విశ్వ హిందూ పరిషత్‌ (VHP), బజరంగ్‌దళ్‌ను ‘తీవ్రవాద మత సంస్థలు’గా అమెరికా గూఢచర్య సంస్థ CIA అభివర్ణించింది
సౌర కుటుంబం వెలుపల గుర్తించిన 100కు పైగా భారీ గ్రహాలకు పెద్ద చందమామలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు
ప్రయాణికుల సౌకర్యం కోసం కరీంనగర్‌ వరకు పొడిగించిన కాచిగూడ-నిజామాబాద్‌ ప్యాసింజర్‌ రైలును రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ 2018 జూన్‌ 15న సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభించారు
గుండెపోటుకు గురైన బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రత్యేక కేంద్రాలు 2018 జూన్‌ 15 నుంచి అందుబాటులోకి వచ్చాయి
గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ తరహా ఇళ్లు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018 జూన్‌ 15న ఉత్తర్వులు జారీ చేసింది.
మహాత్మాగాంధీ స్వయంగా రాసి, సంతకం చేసిన పోస్టు కార్డు వాషింగ్టన్‌లో 2018 జూన్‌ 13న నిర్వహించిన వేలంలో దాదాపు రూ.13 లక్షలు పలికింది
ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు
హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థతో పాటు వరంగల్‌ నగర పాలక సంస్థ పరిధిలో అమలవుతున్న రూ.5కే మధ్యాహ్నం భోజనం అందించే అన్నపూర్ణ పథకాన్ని రాష్ట్రవ్యాప్త విస్తరణకు తెలంగాణ మునిసిపల్‌ శాఖ 2018 జూన్‌ 14న ఉత్తర్వులు జారీ చేసింది.