Telugu Current Affairs One Liners 17 May 2018

Telugu Current Affairs One Liners 17 May 2018

Telugu Current Affairs One Liners 17 May 2018
📌ఎవరెస్టు శిఖరాన్ని 22 సార్లు అధిరోహించి నేపాల్‌కు చెందిన కామి రీత షెర్పా(48) ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆగ్నేయ మార్గంలో అధిరోహించి ఈ పర్వత శిఖరాన్ని 2018 మే 16న చేరుకున్నారు.
📌పాఠశాలల్లో టీచర్లు హాజరు పిలిచేటప్పుడు ‘యస్‌ సార్‌’, ‘యస్‌ మేడం’ అనే మాటకు బదులు ‘జైహింద్‌’ అని మాత్రమే చెప్పాలని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది
📌రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు జపాన్‌ పార్లమెంటు ఒక చట్టం చేసింది.జాతీయ, స్థానిక ఎన్నికల్లో పురుషులకు, మహిళలకు సాధ్యమైనంత సమాన అవకాశాలు కల్పించేలా రాజకీయ పార్టీలను ఈ చట్టం ప్రోత్సహిస్తుంది.
📌మన దేశంలోని గోల్కొండ గనుల్లో బయటపడి ఐరోపా రాజవంశీయుల చేతుల్లోకి వెళ్లిన అరుదైన నీలి వజ్రం ‘ఫార్నెస్‌ బ్లూ’ వేలంలో రూ.45 కోట్ల భారీ ధర పలికింది
📌తెలంగాణలో రెండు కొత్త మెడికల్‌ కాలేజిలకు కేంద్ర ప్రభుత్వం 2018 మే 16న అనుమతించింది. సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలకు 150 సీట్లు, రంగారెడ్డి జిల్లాలో అయాన్‌ వైద్య కళాశాలకు 150 సీట్ల చొప్పున 2018-19 సంవత్సరానికి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
📌ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తొలిసారిగా ‘ఆవశ్యక వ్యాధి నిర్ధారణ పరీక్షల జాబితా’ను విడుదల చేసింది. తరచుగా కనిపించే ఆరోగ్య సమస్యలు, కొన్ని ముఖ్యమైన వ్యాధులను త్వరగా గుర్తించే విధంగా ఈ జాబితాను రూపొందించింది
📌బ్యాంకు లావాదేవీల సమయంలో గుర్తింపు ధ్రువీకరణకు ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, ఆరోగ్యం బాగోలేని వారితో పాటు గాయాల పాలైనవారికీ ఉపశమనం కల్పించేలా కేంద్రం చర్యలు తీసుకుంది
📌మలేషియాకు చెందిన సంస్కరణవాది అన్వర్‌ ఇబ్రహీం(70) 2018 మే 16న జైలు నుంచి విడుదలయ్యారు
📌2018 జూన్‌లో ఆరంభమయ్యే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో విధులు నిర్వర్తించాల్సిన సౌదీ అరేబియా రిఫరీ ఫాహద్‌ అల్‌-మిర్దాసిపై ఆ దేశ ఫుట్‌బాల్‌ సమాఖ్య వేటు వేసింది
📌2028 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా భారత రాజధాని డిల్లీ అవతరించనుందని ఐక్యరాజ్య సమితి అంచనా నివేదిక వెల్లడించింది
📌ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌కు బిజినెస్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌ ‘డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ప్రకటించింది
📌కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ 2018 మే 16న న్యూడిల్లీలో స్వచ్ఛసర్వేక్షణ్‌ 2018 ర్యాంకులను ప్రకటించారు.జాతీయ స్థాయిలో 10 లక్షలకు పైబడి జనాభా గల పరిశుభ్ర నగరాల్లో విజయవాడ తొలి స్థానంలో నిలవగా, 1-3 లక్షల జనాభా విభాగంలో ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ నగరంగా తిరుపతి, రాష్ట్రాల రాజధానుల విభాగంలో అత్యుత్తమ ఘన వ్యర్థాల నిర్వహణ నగరంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ర్యాంక్‌లు సొంతం చేసుకున్నాయి.