Telugu Current Affairs One Liners 18 June 2018

Telugu Current Affairs One Liners 18 June 2018

Telugu Current Affairs One Liners 18 June 2018




?ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అత్యంత క్లిష్టమైన యుద్ధవిమాన పైలట్‌గా దక్షిణ భారతదేశానికి చెందిన మేఘనా షాన్‌బో నియమితులయ్యారు
?పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన ఆరేళ్ల బాలిక భూపతిరాజు తనిష్క సెకన్‌కు 320 నాటికల్‌ మైళ్ల వేగంతో, తక్కువ సమయంలో ఎక్కువ బాణాలు సంధించిన క్రీడాకారిణిగా ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది
?బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది.ఈ కమిటీలో సభ్యులుగా ఇంధన, పరిశ్రమలు, మైన్స్‌, సింగరేణి, ఖనిజాభివృద్ధి అధికారులు ఉన్నారు
?దేశంలోనే అత్యంత పెద్ద వినాయకుడిగా పేరొందిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణపతి ఈసారి ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’గా కొలువుదీరనున్నాడు
?టాటా ట్రస్టు, కోపెన్‌హెగెన్‌ కాన్‌సెన్సస్‌ సెంటర్‌ సంయుక్తంగా ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్య ప్రాజెక్టు’ పేరిట పరిశోధన పత్రాలు వెలువరించాయి
?ఉత్తర మయన్మార్‌లో అంగుళం కంటే చిన్నగా ఉన్న 9.9 కోట్ల ఏళ్లనాటి కప్ప శిలాజాలు నాలుగు దొరికాయి
?తొలితరం తెలంగాణ ఉద్యమ నేత, రామ్‌మనోహర్‌ లోహియా అనుచరుడు, ప్రముఖ సోషలిస్టు నాయకుడు ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌(85) హైదరాబాద్‌లో మృతి చెందారు
?రష్యాలోని అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్‌ ఎల్‌బ్రస్‌ను విశాఖ నగరానికి చెందిన బాలిక కామ్యా కార్తికేయన్‌(10), ఆమె తల్లి లావణ్య, తండ్రి కార్తికేయన్‌ అధిరోహించారు