Telugu Current Affairs One Liners 18 May 2018

Telugu Current Affairs One Liners 18 May 2018

Telugu Current Affairs One Liners 18 May 2018
?ప్రపంచవ్యాప్తంగా బిజినెస్‌ స్కూళ్లు అందిస్తున్న అత్యుత్తమ ఎంబీఏ(ఫర్‌ ఫైనాన్స్‌) విద్యలో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) 44వ స్థానంలో నిలిచింది.
?డిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ స్పెషల్‌ కమిషనర్‌ డాక్టర్‌ రజత్‌ భార్గవ రచించిన ‘ఏ ట్రీటీస్‌ ఆన్‌ క్లీన్లీనెస్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌- యాన్‌ ఇంట్రడక్షన్‌’ గ్రంథాలను 2018 మే 17న పరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు
?రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్న 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో సవరణలు చేయాలని ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు
?తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు 1.572 శాతం కరవు భత్యం (డీఏ) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 17న ఉత్తర్వులు జారీ చేసింది
?లలిత కళా అకాడమీ ఛైర్మన్‌గా ప్రముఖ శిల్పి, కళాకారుడు ఉత్తమ్‌ పాచర్ణే నియమితులయ్యారు.
?2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు కోల్‌కత హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ 2018 మే 16న దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీ(ACDP) పేరుతో పార్టీని రిజిస్టర్‌ చేయించనున్నట్లు వెల్లడించారు.
?ఖరీఫ్‌లో అమలయ్యే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంస్థలను ఎంపిక చేసింది. మొత్తం 14 బీమా సంస్థలు పోటీపడ్డాయి.
?పేద మత్స్యకారులకు ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద 33,122 పింఛన్లు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 50 సం॥లు పైబడిన మత్స్యకారులకు రూ.1000 పింఛను ఉత్తర్వులు జారీ చేసింది.
?కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా), తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(టాటా) సంయుక్తంగా జీవితకాల పురస్కారాన్ని ప్రకటించాయి
?ప్రముఖ మైనింగ్‌ అధ్యయన సంస్థ జియో మైన్‌టెక్‌ ఏటా ఇచ్చే డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును సింగరేణి డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఎస్‌. చంద్రశేఖర్‌కు అందించింది.
?కామన్వెల్త్‌ క్రీడల్లో సత్తాచాటిన తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం నజరానాలు ప్రకటించింది. 2 స్వర్ణ పతకాలు సాధించిన సైనా నెహ్వాల్‌కు రూ.50 లక్షలు, రజతం గెలిచిన సిక్కిరెడ్డికి రూ.30 లక్షలు, రుత్విక శివానికి రూ.20 లక్షలు, బాక్సర్‌ హుసాముద్దీన్‌కు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాల్ని ప్రకటించారు.
?క్రమశిక్షణ ఉల్లంఘించారని పేర్కొంటూ గీత, బబిత, రీతు, సంగీత ఫొగాట్‌లను భారత రెజ్లింగ్‌ సమాఖ్య జాతీయ శిక్షణ శిబిరం నుంచి బహిష్కరించింది.