Telugu Current Affairs One Liners 20 June 2018

Telugu Current Affairs One Liners 20 June 2018

Telugu Current Affairs One Liners 20 June 2018




అత్యధిక మంది కోటీశ్వరులు ఉన్న దేశాల్లో భారత్‌కు 11వ స్థానం దక్కింది. మొత్తం 2.63 లక్ష మంది కోటీశ్వరులు భారత్‌లో ఉన్నట్లు క్యాప్‌ జెమినీ విడుదల చేసిన నివేదికలో వెల్లడయింది.

ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కోకా రామచంద్రరావు(96) 2018 జూన్‌ 17న హైదరాబాద్‌లో మృతి చెందాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఇటీవల చరిత్రాత్మక భేటీలో పాల్గొన్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాజాగా చైనా పర్యటనకు వెళ్లారు

ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డి ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు-2017కి ఎంపికయ్యారు

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఆహార పానీయాల సంస్థ జార్జెస్‌ మొనిన్‌ సాస్‌ తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లాలో తమ పరిశ్రమను స్థాపించనుంది

తెలుగు, తమిళంతో పాటు 6 ప్రాంతీయ భాషలు, ఇంగ్లీష్‌ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు గూగుల్‌ ఓ కార్యక్రమం చేపట్టనుంది

సూర్యరశ్మి సాయంతో గాలిని ఆవిరిగా మార్చి, దానిని చల్లబరచడం ద్వారా నీటిని తయారుచేసే సిద్ధాంతాన్ని బెర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాయానికి చెందిన లారెన్స్‌ బెర్కెలే నేషనల్‌ లేబొరేటరీ శాస్త్రవేత్తలు రూపొందించారు