Telugu Current Affairs One Liners 21 June 2018

Telugu Current Affairs One Liners 21 June 2018

Telugu Current Affairs One Liners 21 June 2018
?మిస్‌ ఇండియా అందాల పోటీలో తమిళనాడుకు చెందిన 19ఏళ్ల అనుక్రీతి విజేతగా నిలిచారు. మిస్‌ వరల్డ్‌-2017 మానుషి ఛిల్లర్‌ అనుక్రీతికి అందాల కిరీటం బహూకరించారు.అనుక్రీతి మిస్‌ వరల్డ్‌-2018 పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
?ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి(UNHRC) ఇజ్రాయెల్‌పై పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ అమెరికా 2018 జూన్‌ 20న ఆ సంస్థ నుంచి వైదొలిగింది.
?జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బీవీఆర్‌ సుబ్రమణ్యం నియమితులయ్యారు.అలాగే ప్రస్తుత సీఎస్‌ బీబీ వ్యాస్‌తోపాటు ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ను గవర్నర్‌ వోహ్రాకు సలహాదారులుగా కేంద్రం నియమించింది.
?జమ్ము కశ్మీర్‌లో 2018 జూన్‌ 20 నుంచి గవర్నర్‌ పాలన అమలులోకి వచ్చింది. జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా
?యోగా అభివృద్ధికి చేసిన విశేష కృషికి గాను వ్యక్తిగతంగా విశ్వాస్‌ మాండలిక్‌ (నాసిక్‌), సంస్థాగతంగా యోగా ఇన్‌స్టిట్యూట్‌ (ముంబయి)కు ప్రధానమంత్రి అవార్డు లభించాయి.ప్రధాని అవార్డు విజేతకు ట్రోఫీ, ప్రశంసాపత్రాలతో పాటు రూ. 25 లక్ష వంతున నగదు ప్రోత్సాహకాలను అందజేస్తారు.
?మునగ విత్తులతో చౌకలో నీటి శుద్ధికి అమెరికాలోని కార్నెగీ మెలాన్‌ విశ్వవిద్యాయ శాస్త్రవేత్తలు ఇసుకలోని సిలికా రేణువును, మునగ విత్తనాల్లోని ప్రొటీన్లను ఉపయోగించి చౌకైన నీటి శుద్ధి మాధ్యమాన్ని తయారు చేశారు. దీన్ని ‘ఎఫ్‌-శాండ్‌’గా పేర్కొంటున్నారు.
?రైతుకు సాగుకు సంబంధించిన సమస్త సమాచారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ ‘రైతు సేవా’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఉభయగోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో పరీక్షించి చూశారు.
?విశాఖ-చెన్నయ్‌ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి రూ.66 కోట్లతో నిధి ఏర్పాటు చేసేందుకు పరిశ్రమ శాఖ కమిషనర్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం 2018 జూన్‌ 20న ఉత్వర్వులు ఇచ్చింది.
?భారత ఆకర్షణీయ నగరాల అవార్డు (2018)కు గాను దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు విశాఖపట్నం ఎంపికైంది.
?ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్త గౌరవ వేతనాన్ని రూ.7 వేల నుంచి రూ.10,500 వరకు. ఆయా వేతనాన్ని రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.
?ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌ సంస్థల(IMF)కు సంబంధించిన నిబంధనను సమీక్షించేందుకు ఇన్సురెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (IRDAI) 10 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సురేష్‌ మాథుర్‌ నేతృత్వం వహించనున్నారు.
?అత్యధికంగా ఆయుధాలు గల దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో, భారత్‌ ద్వితీయ స్థానంలో ఉన్నట్లు ‘స్మాల్‌ ఆర్మ్స్‌ సర్వే’ పేరుతో చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. భారత్‌లో పౌరుల వద్ద 7.1 కోట్ల ఆయుధాలున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. చైనా (4.97 కోట్లు), పాకిస్థాన్‌ (4.39 కోట్లు), రష్యా (1.76 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
?ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు స్కోచ్‌ అవార్డు లభించింది. దీంతోపాటు గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్‌ విభాగానికి మరో 3 అవార్డులు దక్కాయి. పంచాయతీరాజ్‌ శాఖలో సాంకేతికంగా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు గానూ ఈ పురస్కారాలు దక్కాయి.
?తెలంగాణ వ్యవసాయ శాఖకు ‘అగ్రి’ అవార్డు. వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ‘ఇండియా టుడే’ సంస్థ అగ్రి అవార్డును ప్రకటించింది.
?శ్రీలంక రాజధాని కొలంబోలో ఇటీవల జరిగిన డాజల్‌ మిసెస్‌ ఇండియా యునివర్స్‌-2018 కిరీటాన్ని శివమొగ్గకు చెందిన మనీషా వరుణ్‌ దక్కించుకొంది.
?అమెరికా సైన్యంలో కొత్తగా స్పేస్‌ ఫోర్స్‌(అంతరిక్ష దళం)ను ఏర్పాటు చేయాలని ఆ దేశ రక్షణ శాఖ విభాగం పెంటగాన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు.
? ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఆరోగ్య పరిరక్షణ సంస్థలన్నింటిలో లభ్యమయ్యే వివరాలతో కూడిన ‘జాతీయ ఆరోగ్య వనరుల నిధి’ (నేషనల్‌ హెల్త్‌ రీసోర్సెస్‌ రిపాజిటరీ-NHRR))ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా 2018 జూన్‌ 19న ప్రారంభించారు.
? ‘సుమత్రా ఒరంగుటాన్‌’ జాతిలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డు సాధించిన ప్వాన్‌ అనే 62 ఏళ్ల వానరం 2018 జూన్‌ 18న ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో గల ఓ జంతు ప్రదర్శనలో మృతి చెందింది. ఆడ ఒరంగుటాన్‌లు 50 ఏళ్లకు మించి బతకడం చాలా అరుదు.
? చిన్నారులపై నేరాల నివారణ, ఆయా కేసుల్లో అనుసరించాల్సిన ప్రక్రియ, సంబంధిత చట్టాలు, న్యాయస్థానాల తాజా తీర్పులను సమగ్రంగా సంకలనం చేసిన హ్యాండ్‌బుక్‌ను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ 2018 జూన్‌ 19న న్యూదిల్లిలో ఆవిష్కరించారు.
?ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న గృహ నిర్మాణ పథకాల పేర్లను మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్‌ పట్టణ గృహ నిర్మాణ పథకం(బీఎల్‌సీ)ని ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(PMAY‌)-ఎన్టీఆర్‌(పట్టణ)గా, పీఎమ్‌ఏవై గ్రామీణ్‌ పథకాన్ని PMAY‌-ఎన్టీఆర్‌(గ్రామీణ)గా మారుస్తూ ఉత్తర్వు వెలువడ్డాయి