Telugu Current Affairs One Liners 21 May 2018

148 total views, 2 views today

Telugu Current Affairs One Liners 21 May 2018

Telugu Current Affairs One Liners 21 May 2018




?ప్రపంచ సంపన్న దేశాల జాబితాలో భారత్‌ 6వ స్థానంలో నిలిచింది. మనదేశ మొత్తం సంపద దాదాపు రూ.559 లక్షల కోట్లు. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా అమెరికా నిలిచింది.
?మహాత్మాగాంధీ జన్మదినం అయిన అక్టోబర్‌ 2ను శాకాహార దినోత్సవంగా జరపాని రైల్వే బోర్డు ప్రతిపాదించింది.
?తలపాగా ధరించిన సిక్కు మహిళ మొదటిసారిగా న్యూయార్క్‌ పోలీస్‌ విభాగంలో చేరనున్నారు. గురుశోచ్‌ కౌర్‌ అనే సిక్కు మహిళ తొలిసారిగా ఈ ఘనత సాధించారు.
?పసిఫిక్‌ మహాసముద్రంలో 2022 నాటికి నీటిపై తేలియాడే దేశం ఏర్పాటు కానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పేపాల్‌ కంపెనీ యజమాని పీటర్‌ థీల్‌ ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు
? ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి చేరువలో కృష్ణానది ఒడ్డున కొండపల్లిలో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ APHMEL(ఆంధ్రప్రదేశ్‌ హెవీ మిషనరీ అండ్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌) వేరు పడింది. 1994 నుంచి సింగరేణి అనుబంధ సంస్థగా ఉంటూ వస్తున్న APHMEL(ఆప్మెల్‌)ను ఇటీవలే ఏపీ పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి కేటాయిస్తూ షీలాబిడే కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం లభించింది.
?60 మంది మహిళల కీర్తిని 43 నిమిషాల్లో ఆంగ్లంలో చెప్పి విజయవాడకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి హాసిని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది.
?భారత్‌- పాకిస్తాన్‌ మధ్య వివాదాస్పద కృష్ణగంగా హైడ్రాలిక్‌ ప్రాజెక్టుని 2018 మే 19న ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు. భారత్‌ ఈ హైడ్రాలిక్‌ ప్రాజెక్టుని ప్రారంభించడంపై పాకిస్థాన్‌ బహిరంగంగా విమర్శిస్తోంది
?ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఉన్న స్థానంలో పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రతిష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
? 2018 మే 17న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందు బల నిరూపణ చేసుకోలేకపోతున్నానంటూ 2018 మే 19న రాజీనామా చేశారు.
?బ్రిటన్‌ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్‌ మార్కల్‌(36) వివాహం 2018 మే 19న ఘనంగా జరిగింది.

One thought to “Telugu Current Affairs One Liners 21 May 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.