Telugu Current Affairs One Liners 22 June 2018

135 total views, 1 views today

Telugu Current Affairs One Liners 22 June 2018

Telugu Current Affairs One Liners 22 June 2018




?2018 జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా 4వ అంతార్జతీయ యోగా దినోత్సవం నిర్వహించారు
 
?ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి వ్యాప్తంగా 1.26 లక్ష మంది సామూహిక యోగా కార్యక్రమాల్లో పాల్గొని కొత్త రికార్డును సృష్టించారు
 
?భారత సంతతి వైద్యుడు, పాత్రికేయుడు అతుల్‌ గవాండేకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.లాభాపేక్ష లేని తమ కొత్త ఆరోగ్య పరిరక్షణ జాయింట్‌ వెంచర్‌కు నాయకుడిగా గవాండేను అమేజాన్‌, బెర్క్‌షైర్‌ హాథ్‌వే, జేపీ మోర్గాన్‌ సంస్థలు ఎంపిక చేశాయి
 
?ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీలపై గృహహింస మూలంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 1.8 శాతం తగ్గిపోతోందని, దీని విలువ రూ.13,000 కోట్లు అని ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యాల ప్రాజెక్టు అధ్యయనం తేల్చింది
 
?తెలంగాణలో పేదరికానికి కులవ్యవస్థతో లోతైన సంబంధం ఉందని యంగ్‌లైవ్స్‌, సామాజిక ఆర్థిక అధ్యయన సంస్థ (సెస్‌) వెల్లడించింది
 
?2017-18 సంవత్సరానికిగాను తెలంగాణకు పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌, పాస్‌పోర్ట్‌ జారీలో అవార్డు లభించాయి.దేశంలోనే ఉత్తమ పోలీసు వెరిఫికేషన్‌గా తెలంగాణ గుర్తింపు పొందింది.
 
?రాష్ట్ర వినియోగదారులు కమిషన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా మాజీ జిల్లా జడ్జి కె.రమేశ్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
 
?లక్సెంబర్గ్‌ ప్రధానమంత్రి జేవియెర్‌ బెటెల్‌తో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ 2018 జూన్‌ 20న సమావేశమయ్యారు
 
?మౌలిక సదుపాయాలు, వ్యాపారం, పెట్టుబడులు, ప్రాజెక్టు నిర్మాణం తదితరాల్లో నేపాల్‌కు తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని చైనా హామీ ఇచ్చింది.
 
?ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ 2018 జూన్‌ 19, 20 తేదీల్లో చైనాలో పర్యటించారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.