Telugu Current Affairs One Liners 22 May 2018

Telugu Current Affairs One Liners 22 May 2018

Telugu Current Affairs One Liners 22 May 2018




📌వెనిజువెలాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్ట్‌ నేత నికోలస్‌ మదురో(55) విజయం సాధించారు
📌సాగరాలను జయించిన నావికా దళానికి చెందిన ఆరుగురు సాహస వనితలకు కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌, నావికాదళం అడ్మిరల్‌ సునీల్‌ లాంబా పనాజిలో 2018 మే 21న స్వాగతం పలికారు
📌సూపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్లే క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత్‌ 2018 మే 21న విజయవంతంగా పరీక్షించింది.
📌లైంగిక నేరాలకు సంబంధించిన వీడియోలు ప్రసారం కాకుండా అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలపై సమాధానాలు దాఖు చేయడంలో విఫమయినందుకు గూగుల్‌, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలపై సుప్రీంకోర్టు రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది
📌ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన ‘బస్తరియా’ పటాలం శిక్షణ ముగింపు వేడుకలు 2018 మే 21న నిర్వహించారు.
📌లింగ మార్పిడి శస్త్రచికిత్సకు అనుమతించాలని మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాకు చెందిన 29 ఏళ్ల మహిళా కానిస్టేబుల్‌ లితా సాల్వే చేసుకున్న అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది
📌దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు అన్ని మసీదుల్లో నిత్యం చైనా జాతీయ జెండాను ఎగురవేయాలని చైనా ఇస్లామిక్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది
📌భారత బ్యాడ్మింటన్‌ సంఘం(బాయ్‌) సాంకేతిక కమిటీ సభ్యుడిగా యూవీఎన్‌ బాబు నియమితులయ్యారు.
📌అంతర్జాతీయ పెట్టుబడిదారులను, ప్రతిభావంతులను ఆకర్షించడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) కీలక నిర్ణయాలు తీసుకుంది. 10 సం॥ కాలపరిమితి వరకు వర్తించేలా వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించింది
📌సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి(79) 2018 మే 21న అమెరికాలో మృతి చెందారు