Telugu Current Affairs One Liners 23 May 2018

162 total views, 1 views today

Telugu Current Affairs One Liners 23 May 2018

Telugu Current Affairs One Liners 23 May 2018





న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(NYSE) 226 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. NYSE బోర్డు 67వ అధ్యక్షురాలిగా స్టాసీ కన్నిన్‌గమ్‌ నియమితులయ్యారు.
సూపర్‌ సోనిక్‌ వేగంతో దూసుకెళ్లే క్రూయిజ్‌ క్షిపణి ‘బ్రహ్మోస్‌’ వరుసగా రెండో రోజూ 2018 మే 22న విజయవంతంగా దూసుకెళ్లింది
మలేసియాలో ప్రధానమంత్రి మహాతిర్‌ నేతృత్వంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన ఇద్దరు ప్రముఖులకు మంత్రి పదవి లభించింది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన గోబింద్‌ సింగ్‌ డియో(44), ఎం.కులశేగరన్‌(61)ను కేబినెట్‌ మంత్రులుగా మహాతిర్‌ 2018 మే 21న నియమించారు.
త్రివిధ దళాలకు అవసరమయ్యే ఆయుధాలు, ఇతర సాధన సంపత్తి సేకరణ ప్రక్రియను రక్షణ మంత్రిత్వశాఖ సరళతరం చేసింది
మహాత్మాగాంధీ పుట్టిన రోజైన అక్టోబర్‌ 2ను ‘శాకాహార దినం’గా పాటించాలని ప్రతిపాదించిన రైల్వేశాఖ ఆ యోచనను నిలుపుదలలో ఉంచింది
ఆచార్య జయశంకర్‌ తెలామ్గాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2018 మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం జరిగింది
రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందే వ్యక్తు(థర్డ్‌ పార్టీ)ల కుటుంబాలకు ఇకపై కనీసం రూ.5 లక్షల పరిహారం లభించనుంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో 2018 మే 22న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష నిర్వహించారు
కృష్ణానదీ పునరుజ్జీవంపై 2018 మే 22న హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సును తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు

?Read Detailed Articles Here 

One thought to “Telugu Current Affairs One Liners 23 May 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.