Telugu Current Affairs One Liners 24 May 2018

Telugu Current Affairs One Liners 24 May 2018

Telugu Current Affairs One Liners 24 May 2018

?థాయ్‌లాండ్‌లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2018 మే 23 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న బుద్ధ జయంతి సమ్మేళనానికి తెలుగు ఐఆర్‌ఎస్‌ అధికారి ఎన్‌.అశోక్‌బాబు పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు
?వాయు కాలుష్య నియంత్రణకు జర్మనీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హాంబర్గ్‌లో పాత మోడల్‌ డీజిల్‌ కార్లపై నిషేధం విధించింది.
?తెలంగాణ సాగునీటి ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మిషన్‌ కాకతీయ మీడియా అవార్డులు-2017 ప్రదానోత్సవ కార్యక్రమం 2018 మే 23న హైదరాబాద్‌లో నిర్వహించారు
?దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం రేటింగ్‌ దక్కింది.
?బ్రిక్స్‌ దేశాల సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు
?సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫీచర్స్‌ నిర్మించి ప్రసారం చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిషెల్‌ ఒబామా నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు
?గాయం కారణంగా గత కొద్దికాలంగా ఆటలకు దూరంగా ఉంటున్న టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం(TOP) పథకం నుంచి తప్పించింది
?దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు
?ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PMJDY) కింద ఇప్పటివరకు 31.56 కోట్ల ఖాతాలు తెరిచామని ప్రభుత్వం వెల్లడించింది
?వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లోని కుబేరుల సంఖ్య మూడింతలు అవుతుందని అఫ్రేషియా బ్యాంక్‌ గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ నివేదిక అంచనా వేసింది
?ప్రపంచ పర్యటకులు సందర్శించేందుకు మనసుపడుతున్న ప్రఖ్యాత కట్టడాల్లో తాజ్‌మహల్‌కు 6వ స్థానం దక్కింది
?పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత జమ చేసిన సొమ్ముకు వివరాలు చెప్పని వారి నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.6,416 కోట్లు పన్ను రూపంలో వసూలు చేసింది
?మయన్మార్‌లో రొహింగ్యాల తీవ్రవాదులు హిందువులను ఊచకోత కోశారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 2018 మే 23న వెల్లడించింది
?భారత్‌లో తొలిసారిగా 14 ఏళ్ల బాలుడి కడుపులోని కణితిని రోబో సాయంతో వైద్యులు తొలగించారు
?ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కువసార్లు(9) అధిరోహించిన మహిళగా నేపాల్‌కు చెందిన లక్పా షెర్పా రికార్డు సృష్టించారు
?ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(PCI) ఛైర్మన్‌గా వరుసగా రెండోసారీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సి.కె.ప్రసాద్‌(చంద్రమౌళి కుమార్‌ ప్రసాద్‌) నియమితులయ్యారు
?ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేట్‌ స్ట్రీట్‌ ఏర్పాటు చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(CRDA) నిర్ణయించింది.
?తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు రూ. 2 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని న్యాయవాదుల సంక్షేమ ట్రస్టు నిర్ణయించింది.
?ఆరోగ్య సేవల సూచీలో భారత్‌కు 145వ స్థానం దక్కింది. పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌ కంటే భారత్‌ వెనుకబడింది
?తెలంగాణలో భాగస్వామ్య పింఛను పథకం(CPS) ఉద్యోగులకు పదవీ విరమణ, మరణానంతర గ్రాట్యుటీ ప్రయోజనాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 23న ఉత్తర్వులు జారీ చేసింది
?కర్ణాటక ముఖ్యమంత్రిగా జనతాదళ్‌ (ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి 2018 మే 23న ప్రమాణ స్వీకారం చేశారు

?Read Detailed Articles Here