Telugu Current Affairs One Liners 25 June 2018

Telugu Current Affairs One Liners 25 June 2018

Telugu Current Affairs One Liners 25 June 2018




ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ 3వ వార్షిక సమావేశం 2018 జూన్‌ 25, 26 తేదీల్లో ముంబయిలో నిర్వహించనున్నారు.

భారత తొలి రోబోటిక్‌ టెలిస్కోపు తన సేవలను ప్రారంభించింది. ఇండియన్‌ ఆస్ట్రోనోమికల్‌ అబ్జర్వేటరీ(ఐఏవో) అనే టెలిస్కోపును లద్దాఖ్‌లో ఏర్పాటు చేశారు

తమ దేశంలోనే తొలి చమురు శుద్ధి కర్మాగారానికి మంగోలియా 2018 జూన్‌ 22న శంకుస్థాపన చేసింది. భారత్‌ అందిస్తోన్న రూ.6.7 వేల కోట్ల రుణ సాయంతో ఈ కర్మాగార నిర్మాణాన్ని మంగోలియా తలపెట్టింది

జాతీయ మహిళ కమిషన్‌ సలహాదారుగా తెలంగాణ మహిళ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ త్రిపురాన వెంకటరత్నం నియమితులయ్యారు

తెలంగాణ పురపాలకశాఖకు, రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు 22 స్కోచ్‌ అవార్డులు వచ్చాయి

దేశంలో వివిధ విభాగాల్లో సత్తా చాటిన శాఖలు, సంస్థలు, వ్యక్తులకు స్కోచ్‌ అందించే స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ 22 పురస్కారాలు దక్కించుకుంది

ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయకల్లాం రాసిన ‘కల్లామ్స్‌ వేకప్‌ కాల్‌’(ఇంగ్లీష్‌), ‘మేలుకొలుపు’(తెలుగు) పుస్తకాలను విశాఖపట్టణంలో 2018 జూన్‌ 22న రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఈఏఎస్‌ శర్మ అవిష్కరించారు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోకో(గొరిల్లా) తన 46వ ఏట కన్నుమూసింది. 2018 జూన్‌ 21న కోకో మృతిని ‘గొరిల్లా పౌండేషన్‌’ ప్రతినిధులు ధ్రువీకరించారు. సైగల భాషతో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కోకో గోరిల్లా అంబాసిడర్‌గా ఓ వెలుగు వెలిగింది

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టుకు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(CRDA) విడుదల చేయనున్న బాండ్లకు ప్రముఖ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఎం రేటింగ్‌ ఇచ్చింది

టిబెట్‌-ఖాట్మండ్‌ను అనుసంధానిస్తూ వ్యూహాత్మక రైలు మార్గాన్ని నిర్మించాలని చైనా, నేపాల్‌ దేశాలు నిర్ణయించుకున్నాయి

గాలిలోని తేమ నుంచి నీటిని తయారుచేసే ‘ఎట్మాస్ఫెరిక్‌ వాటర్‌ జనరేటర్‌’ పరికరాన్ని IICT(భారత రసాయన సాంకేతిక సంస్థ) శాస్త్రవేత్తల బృందం అందుబాటులోకి తెచ్చింది