Telugu Current Affairs One Liners 25 May 2018

Telugu Current Affairs One Liners 25 May 2018

Telugu Current Affairs One Liners 25 May 2018





?ప్రపంచ ఇన్‌లైన్‌ హాకీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత అండర్‌-19 జట్టులో తెలంగాణ కుర్రాడు పల్లెపాటి చిరాగ్‌ ఎంపికయ్యాడు.
?తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌కు చెందిన పవర్‌లూం నేత కార్మికుడు యెల్ది హరిప్రసాద్‌ 2018 మే 24న 2.5 సెంటీమీటర్ల పరిమాణం ఉన్న చిన్న సూదిలోని సెంటిమీటర్‌ కంటే తక్కువగా ఉన్న రంధ్రంలో నుంచి ఆరున్నర గజాల చీర దూరే విధంగా తయారు చేశాడు
?మావోయిస్టులు, సంఘ విద్రోహశక్తుల చేతిలో పోలీసు కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోతే రూ.30 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హోంగార్డులకు కూడా వర్తింప చేస్తూ 2018 మే 24న ఉత్తర్వులు జారీ చేసింది.
?ఆంధ్రప్రదేశ్‌లో పశుపోషణలో సూచనలు, సలహాలు ఇవ్వడానికి డ్వాక్రా మహిళలను పశుమిత్రలుగా నియమిస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ చర్యలు చేపట్టింది.
?ఈ ఏడాదిలో ఇప్పటిదాకా భారత అగ్రగామి 20 మంది కుబేరులు 17.85 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.1.16 లక్షల కోట్లు) సంపదను పోగొట్టుకున్నారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ సూచీ వెల్లడించింది.
?వచ్చే నాలుగేళ్లలో భారత్‌లో 30 లక్షల కొత్త ఉద్యోగాలను లాజిస్టిక్స్‌ రంగం సృష్టిస్తుందని టీమ్‌లీజ్‌ నివేదిక వెల్లడించింది.
?విశాఖపట్నం విమ్స్‌ కేంద్రంగా ఉద్ధానంలో మూత్రపిండాల వ్యాధులపై పరిశోధన ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
?కేరళలో నిఫా వైరస్‌ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో భారత్‌ ఆస్ట్రేలియా సహాయాన్ని కోరింది.
?ఆర్థిక వ్యవహారాలు, స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలపై రెండు ప్రత్యేక నివేదికలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి అందజేసింది.
?తెలంగాణలో 7 జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.
?బ్రిటన్‌లో ఉండే విదేశీయుల్లో సంఖ్యాపరంగా భారతీయులు 4వ స్థానంలో నిలిచారు.
?కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్రరహితంగా మార్చే దిశగా ఉత్తర కొరియా ‘పుంగ్యే-రీ’ అణు పరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసింది.
?Read Detailed Articles Here