Telugu Current Affairs One Liners 26 July 2018

Telugu Current Affairs One Liners 26 July 2018

Telugu Current Affairs One Liners 26 July 2018




?తాజ్‌మహల్‌ కట్టడం చుట్టూ ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది
 
?తూర్పు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడి 2018 జులై 24న రువాండా నుంచి ఉగాండా చేరుకున్నారు
 
?3 తూర్పు ఆఫ్రికా దేశా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడి 2018 జులై 23, 24 తేదీల్లో రువాండాలో పర్యటించారు
 
?అవినీతి నిరోధక చట్టానికి పలు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును పార్లమెంటు ఆమోదించింది
 
?విజయవాడలోని విద్యాధరపురంలో అమరావతి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 జులై 24న భూమిపూజ చేశారు
 
?ప్రముఖ సాహితీవేత్త, ప్రజాసాహితి గౌరవ సంపాదకులు నిర్మలానంద(84) 2018 జులై 24న హైదరాబాద్‌లో మృతి చెందారు
 
?ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రంగా ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ(LVPEI) మరో 4 సం॥లు కొనసాగనుంది
 
?భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునిల్‌ ఛెత్రి పురుషుల విభాగంలో 2017 ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచారు
 
?రాజ్యసభ సభ్యులు తాము చర్చకు లేవనెత్తే అంశాలు, ప్రశ్నలకు సంబంధించిన నోటీసులను ఇక ఎక్కడి నుంచైనా యాప్‌ ద్వారా పంపించవచ్చని ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు