Telugu Current Affairs One Liners 27 July 2018

Telugu Current Affairs One Liners 27 July 2018

Telugu Current Affairs One Liners 27 July 2018




బాలికలను లైంగిక వేధింపుల నుంచి కాపాడటం ప్రతి పౌరుని బాధ్యత అనే ప్రచార ఉద్యమంలో భాగంగా వరల్డ్‌ విజన్‌ స్వచ్ఛంద సేవాసంస్థ రూపొందించిన ‘మై బాడీ! వాట్‌ ఐ సే గోస్‌’(నా శరీరం నేను చెప్పినట్లు నడుచుకుంటుంది) అనే పుస్తకాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 2018 జులై 25న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు

కండరాల బలహీనత (మస్క్యులర్‌ డిస్ట్రోపీ)కి రెండు ప్రోటీన్లే కారణమని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యుర్‌ బయాలజీ (సీసీఎంబీ) కనుగొంది

కంప్యూటర్‌ మెమరీ సామర్థ్యాన్ని వెయ్యి రెట్లు పెంచే సాంకేతికతను కెనడాలోని అల్బెర్టా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు

హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో జరిగే క్రీడా అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఈసారి సెప్టెంబర్‌ 25న జరుగనుంది

నిత్యావసర సేవల నిర్వహణ చట్టం కింద తెలంగాణ రాష్ట్ర జెన్‌కోలో అన్ని రకాల సమ్మెలపై ఉన్న నిషేధాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ఇంధనశాఖ 2018 జులై 25న ఉత్తర్వులు జారీచేసింది

ఔషధ గుణాల సంపన్నమైన పసుపు ‘గ్లకోమా’(నీటికాసులు) చికిత్సలో అద్భుతంగా పనిచేస్తుందని లండన్‌ విశ్వవిద్యాలయం, ఇంపీరియల్‌ కళాశాలకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా 2018 జులై 25న భారత ప్రధాని నరేంద్రమోడి ఉగాండా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు

కైరళీ-పీపుల్స్‌ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘ఇన్నోటెక్‌’ పురస్కారాల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో 2018 జులై 25న నిర్వహించారు

Daily Current Affairs PDF