176 total views, 1 views today
Telugu Current Affairs One Liners 28 June 2018
Telugu Current Affairs One Liners 28 June 2018
- భారత అథ్లెటిక్స్‌లో 42 సం॥ల రికార్డు బద్దలయ్యింది.పురుషుల 800 మీటర్ల పరుగులో కేరళ అథ్లెట్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 2018 జూన్ 27న గౌహతిలో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 800 మీటర్ల పరుగులో జిన్సన్ 1 నిమిషం 45.65 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి స్వర్ణ పతకం సాధించాడు. శ్రీరామ్సింగ్ పేరిట ఉన్న రికార్డు (1 నిమిషం 45.77, 1976)ను తిరగరాశాడు.
- పేదరికాన్ని భారత్ అధిగమిస్తోందని, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది పేదుండే దేశం అన్న మాట ఇక ఇండియాకు ఏమాత్రం వర్తించదని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ అధ్యయన సంస్థ బ్రూకింగ్స్ నివేదిక పేర్కొంది. అత్యంత ఎక్కువమంది పేదలతో నైజీరియా ప్రథమ స్థానాన్ని ఆక్రమించగా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో రెండో స్థానం కోసం ఎగబాకుతున్నట్లు వారు పేర్కొన్నారు. 2018 మే నాటికి నైజీరియాలో 8.7 కోట్ల మంది నిరుపేదలు ఉండగా, భారత్‌లో వారి సంఖ్య 7.3 కోట్లేనని తేల్చారు.
- జీవం పుట్టుక గుట్టును తేల్చే ప్రయత్నాల్లో భాగంగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ(జాక్సా) ప్రయోగించిన ‘హయబుసా-2’ అన్వేషిణి మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణం అనంతరం భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలోని ర్యుగు గ్రహశకలాన్ని చేరుకుంది.
- జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ మను బాకర్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో స్వర్ణంగెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పిస్టల్ పోటీ ఫైనల్లో మను 242.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో అనీష్ భన్వాలా పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో కాంస్యం సాధించాడు.
- పట్నా హైకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కేంద్రీయ పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించింది.
- ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ రంగనాథన్ కొనసాగుతున్నారు.
- తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడిగా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ నియమితులయ్యారు.
- ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ సౌరభ్ చౌదరీ(16) స్వర్ణ పతకం సాధించి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. జర్మనీలో 2018 జూన్ 26 న జరిగిన టోర్నీలో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు