Telugu Current Affairs One Liners 28 May 2018

Telugu Current Affairs One Liners 28 May 2018

Telugu Current Affairs One Liners 28 May 2018





📌ఛాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో రొనాల్డో జట్టు రియల్‌మాడ్రిడ్‌ విజయం సాధించింది.
📌కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం(NHPM) కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్‌ కాన్పు చేయాలంటే ప్రభుత్వ ఆసుపత్రి అనుమతి అవసరం
📌ఐపీఎల్‌-11 విజేతగా చెన్నై సూపర్‌కింగ్స్‌ నిలిచింది. ముంబైలో 2018 మే 27న జరిగిన ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
📌సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన 2018 మే 27న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది.
📌విప్లవ చిత్రాల కథానాయకుడు మాదాల రంగారావు (70) 2018 మే 27న హైదరాబాద్‌లో మృతి చెందారు
📌ఆక్రమిత జమ్మూకశ్మీరులోని గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతంపై పాక్‌ప్రభుత్వ తాజా వైఖరిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
📌చంద్రుడిపై కాలుమోపిన నాలుగో వ్యక్తిగా గుర్తింపు పొందిన అమెరికా వ్యోమగామి అలెన్‌ బీన్‌ (86) 2018 మే 26న వాషింగ్టన్‌ లో మృతి చెందారు.
📌భార్యకు తన భర్త జీతం గురించి తప్పకుండా తొలుసుకునే హక్కు ఉందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు పేర్కొంది.
📌జపాన్‌ పతనంతో పాటు పునర్‌ వైభవాన్ని కూడా కళ్లారాచూసిన మాజీ ప్రధాని యసుహిరో నకసొనె 2018 మే 27న 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
📌తమిళనాడు కాంగ్రెస్‌ మీడియా ఇన్‌ఛార్జి ఏ.గోపన్న రచించిన ‘జవహర్‌లాల్‌ నెహ్రూ.. యన్‌ ఇలస్ట్రేటెడ్‌ బయోగ్రఫీ’ని 2018 మే 27న డిల్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆవిష్కరించారు
📌భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ 54వ వర్ధంతి సందర్భంగా 2018 మే 27న దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు
📌పాకిస్తాన్‌లో 2018 జూలై 25న దేశవ్యాప్తంగా పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ ఆమోదం తెలిపారు