Telugu Current Affairs One Liners 29 June 2018

Telugu Current Affairs One Liners 29 June 2018

Telugu Current Affairs One Liners 29 June 2018




రాష్ట్రంలోని 17 స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీల నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చెల్లపిల్ల సత్యనారాయణరావు(సీఎస్‌ రావు) 2018 జూన్‌ 28న హైదరాబాద్‌లో మృతి చెందారు

అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి ఇరుదేశాల అధ్యక్షలు డొనాల్డ్‌ ట్రంప్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌లు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు

అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టింది

ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు 2018 జూన్‌ 28న ప్రతినిధుల సభలో వీగిపోయింది

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గొల్లలమోద దగ్గర సముద్ర తీరంలోని 154 హెక్టార్లలో డీఆర్‌డీఓ ఏర్పాటుచేసే క్షిపణి పరీక్ష కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి 100 సంస్థల మార్కెట్‌ విలువ 20 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.1360 లక్షల కోట్లు) స్థాయికి చేరిందని పీడబ్ల్యుసీ సర్వేలో తేలింది

ప్రముఖ కవి కబీర్‌దాస్‌ 500వ వర్థంతిని పురస్కరించుకుని 2018 జూన్‌ 28న ఉత్తరప్రదేశ్‌లోని మగ్‌హర్‌లో గల కబీర్‌దాస్‌ స్మారక స్థలం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోడి చాదర్‌ సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు

ఫ్యాప్సీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ), జీపీఎస్‌ (గ్లోబల్‌ పనోరమ షోకేస్‌) ఆధ్వర్యంలో ‘తెలంగాణ పర్యాటకం-2018’పై సదస్సును జూన్‌ 28న హైదరాబాద్‌లో నిర్వహించారు

ఇండియా టుడే మేగజైన్‌ చేపట్టిన ఉత్తమ విశ్వవిద్యాలయాల సర్వేలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి 3వ ఉత్తమ యూనివర్సిటీగా ర్యాంకు లభించింది

2018 జూన్‌ 28న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1,36,733 కోట్ల రాష్ట్ర రుణ ప్రణాళికను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ విడుదల చేశారు

 

For Daily Quiz

Daily Current Affairs PDF