Telugu Current Affairs One Liners 29 May 2018

84 total views, 3 views today

Telugu Current Affairs One Liners 29 May 2018

Telugu Current Affairs One Liners 29 May 2018





జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (NCDRC) అధ్యక్షునిగా జస్టిస్‌ఆర్‌.కె.అగర్వాల్‌ నియమితులయ్యారు.
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తొలిసారిగా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (CFO) సుధా బాలకృష్ణన్‌ ను నియమించింది.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అధిపతి ఎస్‌.క్రిస్టోఫర్‌ 2018 మే 28న పదవీ విరమణ చేశారు.దీంతో 3 నెలల పాటు ఈ బాధ్యతను రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్‌ మిత్రాకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
భారత సంతతి శాస్త్రవేత్త వీణా సహజ్‌వాలాకు 2018 సం॥నికి గాను ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఫెలోషిప్‌ లభించింది.
వ్యవసాయదారులను వస్తు-సేవ పన్ను GST నుంచి మినహాయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ 2018 మే 28న స్పష్టం చేసింది.
నానాటికీ పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల బెడద నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ఐరోపా సంఘం EU ఒక ప్రతిపాదన చేసింది.
‘పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమ’ని సిగరెట్ల ప్యాకెట్లపై ముద్రించే హెచ్చరిక 2019 ఏప్రిల్‌ నుంచి మద్యం సీసాలపై కూడా కనిపించనుంది.
పతంజలి స్వదేశీ సిమ్‌ కార్డు విడుదల.భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL)తో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డును సంస్థ విడుదల చేసింది
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని క్యాంటీన్లలో ఆహార భద్రత పర్యవేక్షకులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నసీరుల్‌ ముల్క్‌ నియమితులయ్యారు.
ప్రధాని నరేంద్రమోడి 2018 మే 28న నెదర్లాండ్స్‌ రాణి మాక్సిమాతో సమావేశమయ్యారు.
తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న వేదాంత లిమిటెడ్‌కు చెందిన స్టెరిలైట్‌ రాగి పరిశ్రమ శాశ్వత మూసివేతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌(IJU) నూతన అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్‌, సెక్రటరీ జనరల్‌గా సబీనా ఇంద్రజిత్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ నియమితులయ్యారు

Telugu current affairs 29 may 2018 pdf free download

One thought to “Telugu Current Affairs One Liners 29 May 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.