Telugu Current Affairs One Liners 30 May 2018

Telugu Current Affairs One Liners 30 May 2018

Telugu Current Affairs One Liners 30 May 2018





📌అంతర్జాతీయ పబ్లికేషన్స్‌ సంస్థ బారన్స్‌ విడుదల చేసిన టాప్‌-30 గ్లోబల్‌ సీఈఓ జాబితాలో HDFC ఎండి ఆదిత్య పూరీకి చోటు లభించింది
📌స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డుకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ సొసైటీ ఎంపికైంది.
📌ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌ సి.కుటుంబరావు పదవీకాలాన్ని ప్రభుత్వం మరో 2 సం॥లు పొడిగించింది
📌ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి 2018 మే 27న ఆమోద ముద్ర వేశారు
📌రైతు బీమాకు ‘తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌ రైతుబంధు బీమా పథకం’గా నామకరణం చేశారు. ఈ పథకాన్ని కేవలం పట్టాదారు పాస్‌ పుస్తకాలున్న రైతులకే వర్తింపజేస్తారు.
📌భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా సీనియర్‌ దౌత్యవేత్త పంకజ్‌ శరణ్‌ను కేంద్రం నియమించింది
📌ఆఫీస్‌ ఖర్చుల కింద మాజీ రాష్ట్రపతులకు ఏటా గరిష్ఠంగా రూ.లక్ష, మాజీ ఉప రాష్ట్రపతులకు రూ.90 వేలు చొప్పున అదనంగా చెల్లించనున్నట్లు హోంశాఖ తెలిపింది.
📌చట్టంలో గుర్తించిన 21 శారీరక, మానసిక వైకల్యాల్లో ఏదో ఒకదానితో ఇబ్బంది పడుతున్నవారికి జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్‌ (NHPM) కింద ప్రయోజనాన్ని వర్తింపచేయాలని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ సూచించింది
📌క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్‌ టెస్సి థామస్‌ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు
📌మూడు తూర్పు ఆసియా దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడి 2018 మే 29న ఇండోనేసియా చేరుకున్నారు
📌దేశవ్యాప్తంగా ఉన్న ముద్ర పథకం లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోడి 2018 మే 29న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు
📌తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికి గ్యాస్‌ సరఫరా చేసేందుకు పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు(PNGRB) నిర్ణయించింది.

Telugu current affairs 30 may 2018 pdf free download