Telugu Current Affairs One Liners 31 July 2018

Telugu Current Affairs One Liners 31 July 2018

Telugu Current Affairs One Liners 31 July 2018
?దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్‌ 10వ శిఖరాగ్ర సదస్సు చివరి రోజు 2018 జులై 27న నిర్వహించిన ‘ఔట్‌రీచ్‌ సెషన్‌’లో భారత ప్రధాని నరేంద్రమోడి ప్రసంగించారు.

?తెలంగాణలోని కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలో గ ఫాల్గుణ పెద్దపులికి అరుదైన గౌరవం దక్కింది.పెద్దపులి ఫొటోతో ఉన్న పోస్టల్‌ స్టాంప్‌ను కేంద్రం విడుదల చేసింది. కాగజ్‌నగర్‌ డివిజన్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఇటీవల అంగీకరించింది.

?ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గుర్తింపు పొందిన 117 ఏళ్ల జపాన్‌ బామ్మ చియో మియాకో 2018 జులై 22న కనగావా రాష్ట్రంలో మృతి చెందారు. మియాకో 1901 మే 2న జన్మించారు

?వ్యక్తిగత డేటాకు భద్రతనిచ్చే ఒక వ్యవస్థపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక.గోప్యతను సాధారణ హక్కుగా గుర్తిస్తూ వ్యక్తిగత సమాచార భద్రతపై ఒక ముసాయిదా బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించింది.

?ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం 2018 జులై 27 రాత్రి కనువిందు చేసింది.సుదీర్ఘ సమయం పాటు కొనసాగిన సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 11.44 గంటకు మొదలై అర్ధరాత్రి ఒంటి గంటకు సంపూర్ణ దశకు చేరుకుంది.

?హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌(హైసియా) వార్షిక సమావేశం 2018 జులై 27న మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించారు.

Daily Current Affairs PDF