Telugu Current Affairs One Liners 31 May 2018

Telugu Current Affairs One Liners 31 May 2018

Telugu Current Affairs One Liners 31 May 2018
?క్లిష్టమైన ఇనుప ఖనిజం ప్రాసెసింగ్‌లో పరిశోధన సహకారానికి కామన్‌వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (CSIRO), ఆస్ట్రేలియాతో NMDC ఒప్పందం కుదుర్చుకుంది
?ICICI బ్యాంకుల ఎండీ, సీఈఓ చందా కొచ్చర్‌పై ఆ బ్యాంకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది
?వాట్సాప్‌కి పోటీగా యోగా గురువు రాందేవ్‌ బాబా సరికొత్త మెసేజింగ్‌ యాప్‌ ‘కింభో’ను 2018 మే 30 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు
? భారత స్టార్‌ అథ్లెట్‌ వికాస్‌గౌడ డిస్కస్‌ త్రోకు వీడ్కోు పలికాడు.
?నిరంకుశ పాలకుడు రాబర్ట్‌ ముగాబే తొలగింపు అనంతరం జింబాబ్వేలో తొలిసారిగా దేశాధ్యక్ష పదవికి, పార్లమెంటుకు 2018 జులై 30న ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
?మైనర్‌ పిల్లలపై సంరక్షకులకు సంపూర్ణ అధికారాలేమీ ఉండవని, ఆ పిల్లల అభీష్టాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
?ఆధునాతన పినాకా రాకెట్‌ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో 2018 మే 30న దీన్ని నిర్వహించారు
?మహాభారతాన్ని ప్రఖ్యాత గీతాప్రెస్‌ తెలుగులో ప్రచురించనుంది. ఉర్దూతో సహా దాదాపు 15 భాషల్లో సుమారు 1800 వందల రకాల పుస్తకాలను గీతాప్రెస్‌ ముద్రిస్తోంది
?పాలపుంతకు ఆవల 2 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఒంటరి నక్షత్రం మన పాల పుంతకు ఆవల 2 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో తొలిసారి ఓ ప్రత్యేకమైన ఒంటరి న్యూట్రాన్‌ స్టార్‌ను నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
?వైద్య సేవల్ని బలోపేతం చేయడంలో భాగంగా దేశంలో ప్రతీ జిల్లాలో డిస్పెన్సరీతో కూడిన శాఖా కార్యాయాన్ని (డీసీబీవో) ఏర్పాటు చేయాని కార్మిక రాజ్య బీమా సంస్థ( ESIC) నిర్ణయించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ 2018 మే 30న వెల్లడి౦చింది
?భారత్‌-ఇండోనేసియా మధ్య సంబంధాలు సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకువెళ్లే రీతిలో 15 ఒప్పందాలు ఖరారయ్యాయి
?రైతుబీమా పథకం కింద నమోదైన రైతుల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా వారి కుటుంబానికి సైతం రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ తెలిపింది
?తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 24 రంగాల్లో సేవలందించిన 48 మందికి ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది
?ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సామాజిక భద్రత పింఛన్ల ఎంపిక ప్రక్రియను రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (RTGS)ద్వారా చేపడుతోంది
?ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018 మే 30న రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం ఈ చిహ్నాలను ఖరారు చేసింది.రాష్ట్ర వృక్షంగా వేప, రాష్ట్ర జంతువుగా జింక ఇప్పటికే కొనసాగుతుండగా రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును, రాష్ట్ర పక్షిగా రామ చిలుకను కొత్తగా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు