TSPSC TRT 2017 SGT Preparation Plan

TSPSC TRT 2017 SGT Preparation Plan

TSPSC TRT 2017 SGT Preparation Plan

కొంతకాలంగా ఎదురుచూస్తున్న టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ) ప్రకటన రానే వచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఊహించనివిధంగా కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ రావడం, కొన్ని జిల్లాల్లో పోస్టులు లేకపోవడం, ఉన్న జిల్లాలోనూ పోస్టుల సంఖ్య పరిమితంగా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టి ఓపెన్ కోటాకు పోటీపడాల్సి రావడంతో ఆశావహులు తమ లక్ష్యసాధనకు పక్కా ప్రణాళికతో సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదవాల్సి ఉంది. ఉపాధ్యాయ నియామకాలను గతంలో జిల్లా సెలక్షన్ కమిటీలు (డీఎస్సీ) నిర్వహించేవి. గతంలో జరిగిన డీఎస్సీల్లోని అవకతవకలు, అభ్యంతరాలు నేటికీ కోర్టు కేసుల్లో నలుగుతున్నాయి. అలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించడానికి, సకాలంలో నియామకాలు చేపట్టడానికి, కాలాయాపన తగ్గించడానికి టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ)తో టీఎస్‌పీఎస్సీ ద్వారా మొదటిసారిగా ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 20 మార్కులు, టీఆర్‌టీకి 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించి, మెరిట్ కం రోస్టర్ విధానంలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనుంది.

tspsc trt 2017 SGT preparation plan

Part – I GENERAL KNOWLEDGE AND CURRENT AFFAIRS (Marks: 10)
-జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్: ఈ విభాగం పరిధి చాలా విస్తృతమైంది. గత ప్రశ్నపత్రాల్ని పరిశీలించినట్లయితే విభిన్న రకాల ప్రశ్నలు ఇచ్చారు. దేశాలు-రాజధానులు, కరెన్సీ-జాతీయ చిహ్నాలు, గ్రంథాలు-రచయితలు-బిరుదులు, క్రీడలు-ట్రోఫీలు, పదవులు, ప్రముఖ వ్యక్తులు, అవార్డులు, ప్రదేశాలు-ప్రాముఖ్యత మొదలైన అంశాలు పరీక్షల్లో ఇచ్చారు. ప్రామాణికమైన పుస్తకాలు, మ్యాగజైన్‌లను చదవడం ద్వారా మంచి స్కోరు సాధించవచ్చు.

Part – II PERSPECTIVES IN EDUCATION (Marks: 10)

 • భారతదేశ విద్యాచరిత్ర, లక్ష్యాలు, కమిటీలు -విద్యా కమిషన్స్ ఏర్పడిన సంవత్సరాలు, వాటి అధ్యక్షులను గుర్తుంచుకుంటే సులభంగా సమాధానాలు రాయవచ్చు.
 • ఉపాధ్యాయ సాధికారత – వృత్తిపరమైన అభివృద్ధి -ఉపాధ్యాయ వృత్తిపరమైన అంశాలు, వృత్తి నైపుణ్యాలు పెంపొందించే సంస్థలపై పట్టు సాధిస్తే సమాధానాలివ్వడం సులభమవుతుంది.
 • భారతదేశంలో సమకాలీన విద్యాదృక్పథాలు -విద్యాదృక్పథంలోని భాషా పదాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలి.
 • బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009, బాలల, మానవ హక్కులు -RTE – 2009 విద్యాహక్కు చట్టం నుంచి ఎక్కువ  ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సృజనాత్మకతతో చదవండి.
 • జాతీయ విద్యా ప్రణాళిక చట్రం-2005

Part – III Language – I (Indian Languages) (Marks: 09)

తెలుగు కవులు, రచనలు, వ్యాకరణం, వ్యాసాలు, కథలు  మొదలగు అంశాలపై పట్టు సాదించాలి.

Part – IV Language II – English (Marks: 09)

 

ఉద్యోగ సాధనలో కీలకమైన సబ్జెక్ట్ ఇంగ్లిష్. దీనిలోభాగంగా అభ్యర్థుల ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. కాబట్టి అభ్యర్థులు  ఇంగ్లిష్ వ్యాకరణంపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ భాష పదజాలంపై సమగ్ర అవగాహనను పెంపొందించుకోవాలి.

CONTENT Part V – (Marks: 27):

Maths , Science , Social కంటెంట్‌ ప్రతి విభాగానికి కచ్చితమైన మార్కులు ఇచ్చారు. కాబట్టి అభ్యర్థులు ఏ విభాగాన్నీ విస్మరించకుండా ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా శ్రద్ధగా చదవాలి.

అభ్యర్థులు ఏదైనా ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను చదివి, దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి.

గతంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గురుకుల  ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే సంబంధిత సబ్జెక్టులో ఎక్కువగా అభ్యర్థుల సాధారణ విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలు వచ్చాయి.
-దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, సమగ్రంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

Teaching Methodology (Marks: 15)

బోధనా పద్ధతులు (మెథడాలజీ):

 • Telugu  , English , Maths , Science , Social మెథడాలజీ సిలబస్‌లో పేర్కొన్న స్వభావం, పరిధి, బోధనా లక్ష్యాలు, కరిక్యులం, బోధనాపద్ధతులు, వార్షిక ప్రణాళిక, యూనిట్, పాఠ్య ప్రణాళిక, బోధన వనరులు, ఉపాధ్యాయుడు-పాత్ర, మూల్యాంకనం అంశాలను చాలా మంది అభ్యర్థులు సులభంగా భావిస్తారు. మారిన పాఠ్య పుస్తకాలు, బోధనా విధానాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.
 •  ఇందులో ఇచ్చిన ప్రశ్నలు అనుప్రయుక్త సామర్థ్యాన్ని అంచనావేసేవిధంగా ఉంటాయి. విషయ పరిజ్ఞానం బోధనాభ్యసనలో మెథడాలజీని అన్వయం చేయడం, అవగాహన చేసుకోవడంపై ప్రశ్నలను అడగటానికి అవకాశం ఉంది.
 • మెథడాలజీలో ఎక్కువ మార్కులు పొందడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానాలు, ప్రస్తుతం అమలవుతున్న విధానాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ప్రామాణికమైన పుస్తకాలు సమకూర్చుకొని, గత ప్రశ్న పత్రాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం, ప్రశ్నల సరళిని, సిలబస్ పరిధిని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి.

మొత్తం సిలబస్ ని 10 భాగాలుగా విభజించి ఎలా చదువాలో పూర్తీ ప్లాన్ క్రింది PDF లో పొందు పరిచాము.

TRT – SGT Syllabus & Schedule

ముఖ్యమైన విషయాలు :

 • చాలామంది అభ్యర్థులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కోసం మార్కెట్‌లో విడుదలైన ప్రతీ పుస్తకాన్ని చదివేందుకు సిద్ధపడతారు. ప్రామాణికతగల పబ్లికేషన్ పుస్తకాలు, యోజన వంటి మాస పత్రికలు, దినపత్రికల్లోని అంశాలతో నోట్స్ తయారుచేసుకోవడం మంచిది.
 • స్టడీ మెటీరియల్స్, క్వశ్చన్‌బ్యాంక్‌లు చదవడం కన్న, డిస్క్రిప్టివ్ మెటీరియల్ చాప్టర్‌వైజ్‌గా చదివి సొంతంగా నోట్స్ తయారుచేసుకోవాలి. పరీక్షలో అడిగే బహుళైచ్ఛిక ప్రశ్నల్లో ఇచ్చే సమాధానాలు చాలా దగ్గర సంబంధం కలిగి ఉండటంవల్ల తికమక పడే అవకాశం ఉంటుంది. పుస్తకాలు చదివేటప్పుడు కీలక భావనలు, ముఖ్యాంశాలు, ప్రాథమిక భావనలు అండర్‌లైన్ చేసుకోవడం వల్ల పునశ్చరణలో సమయం ఆదా అవుతుంది.
 • చదివిన పాఠ్యాంశాలను గ్రూపుతో చర్చించుకోవడం ద్వారా విషయావగాహనతో పాటు పునర్బలనం కావడం, తన లోపాలు, తప్పులను సరిచేసుకోవడంతోపాటు సమయం కూడా ఆదా చేసుకోవచ్చు.
 • సంక్లిషమైన విషయాలను నిజ జీవిత సంఘటనలు, ఉదాహరణలు, మైండ్‌తో అధ్యయనం చేయడం ద్వారా జ్ఞాపకశక్తి ఎక్కువకాలం ఉంటుంది.
 • వ్యక్తిగా బలాలు, బలహీనతలు గుర్తుంచుకొని తగినవిధంగా విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించేలా కృషిచేయాలి.
 •  ఆత్మవిశ్వాసంతో ప్రామాణిక పుస్తకాలు, సిలబస్ కలిగి ఉన్న పుస్తకాలు విశ్లేషణాత్మకంగా చదువుతుండాలి.

చదవాల్సిన పుస్తకాలు:

 • కంటెంట్ కోసం 1 నుంచి 7 తరగతుల పాఠ్య పుస్తకాలు
 • తెలుగు అకాడమీ డీఎడ్ పుస్తకాలు – మెథడాలజీ, విద్యా దృక్పథాలు
 • జీకే, కరెంట్ అఫైర్స్ కోసం- ప్రామాణిక పుస్తకాలు యోజన మొదలైనవి
 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే బులెటెన్‌లు.

One thought to “TSPSC TRT 2017 SGT Preparation Plan”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.