Types of Writs issued by Supreme & High Court of India in Telugu | Vyoma
: సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీచేసే రిట్లు :::
» హెబియస్ కార్పస్: ఈ రిట్ ప్రకారం నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి. | |
» మాండమస్: ‘మేము ఆజ్ఞాపిస్తున్నాం’ అని దీని అర్థం. ఏ అధికారి అయినా ప్రజాసంబంధ, చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు వాటిని నిర్వర్తించమని కోర్టులు జారీ చేసే రిట్. |
|
» ప్రొహిబిషన్: దిగువ కోర్టు తన అధికార పరిధిలో లేని విషయాన్ని గురించి విచారిస్తున్నప్పుడు దాన్ని నిలిపివేయమని ఈ రిట్‌ను జారీ చేస్తారు. | |
» సెర్షియోరరి: కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిలో ఉండేలా చూడటం ఈ రిట్ ఉద్దేశం. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి ఈ రిట్‌ను జారీ చేస్తారు. | |
» కోవారంటో: ‘ఏ అధికారంతో’ అని దీని అర్థం. ఏ అధికారంతో పదవిలో కొనసాగుతున్నారో ఆధారాలు చూపమని కోర్టులు జారీ చేసే రిట్. * రిట్ అంటే ‘ఆజ్ఞ’ అని అర్థం. |