Union Budget 2019 Live Updates In Telugu

1,039 total views, 1 views today

Union Budget 2019 Live Updates In Telugu

union budget 2019

Union Budget 2019 Live Updates In Telugu

బడ్జెట్‌: రైతులకు రూ. 6వేలు ఆర్థిక సాయం

తెలంగాణ ప్రభుత్వం యొక్క రైతు బంధు పథకం ఇప్పుడు దేశం మొత్తం కూడా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (ప్రతి సంవత్సరానికి 6 వేలు)ద్వార అమలు లోకి రానుంది.

లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌పై ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రసంగిస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం అందించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 5 ఎకరాలలోపు భూమి ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. రూ. 2వేల చొప్పున మూడు వాయిదాల్లో డబ్బులు ప్రత్యక్షంగా రైతుల ఖాతాల్లోకి బదిలీ అవుతుందన్నారు. దీని ద్వారా 12 కో్ట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 2018 డిసెంబర్‌ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 75వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.

2024 వరకు ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్

వచ్చే ఐదేళ్ళలో భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రపంచం లో పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లో స్థానం సాదిస్తుందని ఆర్థిక మంత్రి తెలియజేసారు, రవాణా వాహనాలు ఎక్కువగా ఉపయోగిస్తున్న దేశాలలో మన దేశం కూడా ఒకటని ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరిగిందని 2030 కల్లా మనం ఈ రంగం లో అగ్ర స్థానం లో ఉంటామని తెలియజేసారు

సినిమా రంగానికి సింగల్ విండో విధానం

సినిమాల నిర్మాణాల అనుమతి కోసం సింగల్ విండో విధానం తీసుకొస్తునట్లు ఆర్ధికమంత్రి ప్రకటించారు

ఆదాయ పన్ను పరిమితి పెంపుతూ నిర్ణయం

ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న Rs 2.50 Lakhs నుండి Rs 5.00 Lakhs వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు
మధ్య తరగతి ప్రజలకు రెట్టింపు ఊరట
3 కోట్ల ఉద్యోగులకు ఊరట కలిగించిన బడ్జెట్

పెరిగిన మొబైల్ డేటా వినియోగం

గడిచిన సంవత్సర కాలంగా నిత్యం దేశ ప్రజలు ఉపయోగించే మొబైల్ డేటా వినియోగం 50 రేట్లు పెరిగిందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు, ప్రపంచం లో తక్కువ ధరలో డేటా మరియు మొబైల్ సెట్స్ ని అందిస్తున్న దేశాలలో భారత్ ఒకటని తెలియజేసారు.

రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు

రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 40ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్‌ మ్యాన్‌ వన్‌ పెన్షన్‌ అమలు చేశాం. దేశ రక్షణలో సైనికుల త్యాగం నిరుపమానం

60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి రూ.3వేలు పింఛన్‌

ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్‌. 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్‌ వచ్చే విధంగా పథకం. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్‌. అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తింపు

గ్రాట్యుటీ పరిమితి 30లక్షలకు పెంపు

గ్యాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నాం. కొత్త పెన్షన్‌ విధానం సరళీకరిస్తాం! పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంపు. కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు. ఈపీఎఫ్‌వో సభ్యుల సంఖ్య రెండేళ్లలో 2కోట్లు పెరిగింది. కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంపు

గోకుల్‌ మిషన్‌కు రూ.750కోట్లు

గోకుల్‌ మిషన్‌ కోసం రూ.750కోట్లు కేటాయిస్తున్నాం. గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు

రైతులకు ఏడాది రూ.6వేలు

పేద రైతుల ఆదాయం పెంపునకు చర్యలు చేపట్టాం. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఏడాది రూ.6వేలు అందిస్తాం. 2 హెక్టార్ల లోపల(5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు. మూడు దఫాలుగా ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. దీని ద్వారా 12కోట్లమంది రైతులు లబ్ధి పొందుతారు.

మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం

మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం. 22 రకాల పంటలకు మద్దతు ధర పెంచాం. ప్రధానమంత్రి సడక్‌యోజనకు రూ.19వేల కోట్లు ఖర్చు చేశాం. ఇప్పటివరకూ రూ.3వేల కోట్ల పేదల ధనం ఆదా అయింది. 2014కు ముందు బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించాం.

50కోట్ల మందికి అండగా ఆయుష్మాన్‌ భారత్‌

గ్రామీణ, పట్టణాల మధ్య అంతరాల తొలగింపునకు కృషి చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ సడక్‌యోజనలో భాగంగా మూడింతల రహదారుల నిర్మాణం పెరిగింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి రూ.60వేల కోట్లు ఖర్చు చేశాం.

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించాం

మా ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం. రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించగలిగాం. మా ప్రభుత్వ పాలన దేశంలో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. మా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని నిజాయతీగా అమలు చేస్తోంది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించాం.

ద్రవ్యోల్బణం 4.6శాతానికి తీసుకొచ్చాం

సంస్థాగతమైన ఆర్థిక సంస్కరణలలో ముందుకు సాగుతున్నాం. రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు భారత దేశానికి వచ్చాయి. జీఎస్‌టీ సహా పన్నుల వ్యవస్థల్లో సంస్కరణలు అమలు చేస్తున్నాం.రూ.3లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాం.

ఈఎస్‌ఐ పరిమితి రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంపు

ఈఎస్‌ఐ పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచుతున్నా. రూ.15వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం. కొత్త పెన్షన్‌ పథకం ప్రధాన మంత్రి శ్రమ్‌ యోగి మాన్‌ధన్‌కు రూ.500కోట్లు కేటాయింపు.

ఉజ్వల యోజన కింద 8కోట్ల ఉచిత వంటగ్యాస్‌ కనెక్షన్లు

ముద్ర యోజనలో రూ.7.23లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం. దేశంలో 100 ఎయిర్‌పోర్టులు క్రియాశీలకంగా ఉన్నాయి. ప్రపంచంలోనే రహదారుల నిర్మాణం భారత్‌లో వేగంగా సాగుతోంది. రోజుకు 27కి.మీ. రహదారిని నిర్మిస్తున్నాం. కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌లను తొలగించాం. అత్యధిక వేగంగా ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రానుంది.

రైల్వేకు రూ.64,500కోట్లు

భారతీయ రైల్వేలకు రూ.64,500 కోట్లు కేటాయిస్తున్నాం. బ్రాడ్‌గేజ్‌లో కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించాం.

HIGHLIGHTS OF BUDGET 2019

Tax
1. Within 2 years, Tax assessment will be done electronically
2. IT returns processing in just 24 hours
3. Minimum 14% revenue of GST to states by Central Govt.
4. Custom duty has abolished from 36 Capital Goods
5. Recommendations to GST council for reducing GST rates for home buyers
6. Full Tax rebate upto 5 lakh annual income after all deductions.
7. Standard deduction has increase from 40000 to 50000
8. Exempt on tax on second self-occupied house
9. Ceiling Limit of TDS u/s 194A has increased from 10000 to 40000
10. Ceiling Limit of TDS u/s 194I has increased from 180000 to 240000
11. Capital tax Benefit u/s 54 has increased from investment in one residential house to two residential houses.
12. Benefit u/s 80IB has increased to one more year i.e. 2020
13. Benefit has given to unsold inventory has increased to one year to two years.
Other Areas
14. State share has increased to 42%
15. PCA restriction has abolished from 3 major banks
16. 2 lakhs seats will increase for the reservation of 10%
17. 60000 crores for manrega
18. 1.7 Lakh crore to ensure food for all
19. 22nd AIIMS has to be opened in Haryana

HIGHLIGHTS OF BUDGET 2019

20. Approval has to be given to PM Kisan Yojana
21. Rs. 6000 per annum has to be given to every farmer having upto 2 hectare land. Applicable from Sept 2018. Amount will be transferred in 3 installments
22. National kamdhenu ayog for cows. Rs. 750 crores for National Gokul Mission
23. 2% interest subvention for farmers pursuing animal husbandry and also create separate department for fisheries.
24. 2% interest subvention for farmers affected by natural calamities and additional 3% interest subvention for timely payment.
25. Tax free Gratuity limit increase to 20 Lakhs from 10 Lakhs
26. Bonus will be applicable for workers earning 21000 monthly
27. The scheme, called Pradhan Mantri Shram Yogi Mandhan, will provide assured monthly pension of Rs. 3,000 with contribution of Rs. 100 per month for workers in unorganized sector after 60 years of age.
28. Our government delivered 6 crores free LPG connections under Ujjawala scheme
29. 2% interest relief for MSME GST registered person
30. 26 weeks of Maternity Leaves to empower the women
31. More than 3 Lakhs crores for defence
32. One lakh digital villages in next 5 years
33. Single window for approval of India film makers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.