కేంద్ర బడ్జెట్ 2020
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. ఆర్థికలోటుతో దేశ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ 2020-21 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కేంద్రబడ్జెట్‌ను రెండోసారి ప్రవేశపెడుతున్న తొలి మహిళగా ఘనత సాధించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. నిర్మలమ్మ బడ్జెట్ వినేందుకు ఆమె కుమార్తె వాఙ్మయి కూడా పార్లమెంట్‌కు వచ్చారు. ఆమెతో పాటు నిర్మల కుటుంబసభ్యులు కూడా విచ్చేశారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియెవా
గత సంవత్సరం భారత్ తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితులు ఎదుర్కొందని.. అయితే అది సంక్షోభంలోకి మాత్రం వెళ్లలేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియెవా తెలిపారు. బ్యాంకింగేతర రంగంలో నెలకొన్న ఒడుదొడుకులు, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాల వల్లే భారత ఆర్థిక రంగం కుదుపులకు లోనైందని అభిప్రాయడ్డారు. 2020లో 5.8శాతం, 2021లో 6.5శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు కేంద్ర బడ్జెట్ పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్లమెంట్‌కు వచ్చే ముందు నిర్మల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. అటు బడ్జెట్‌ను ఆమోదించేందుకు కేంద్ర మంత్రివర్గం కూడా సమావేశమైంది. బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఇది సామాన్యుల బడ్జెట్ అని అభివర్ణించారు
2020-21 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ హైలైట్స్..
- గత రెండేళ్లలో 16లక్షల పన్ను చెల్లింపుదారులు కొత్తగా చేరారు. ఏప్రిల్ 2020 నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళతరం అవుతాయి.
- దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఆవాసం. ఇప్పటివరకూ 40 కోట్ల మంది జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేశారు
- మూడు లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం
- న్యూఇండియా 2) సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ 3) ప్రజా సంక్షేమం
రంగాలవారీగా కేటాయింపులివే..
- జల్‌జీవన్ మిషన్‌కు రూ 11,500 కోట్లు
- విద్యారంగానికి రూ 300 కోట్లు
- నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
- కొత్తగా ఐదు స్మార్ట్ సిటీల అభివృద్ధి
- నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్ ఏర్పాటుకు రూ1480 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
- చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం
- త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ
- రవాణా మౌలిక సదుపాయాలకు రూ 7 లక్షల కోట్లు
- చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం
- త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ
- 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే పూర్తి
- పెద్దసంఖ్యలో తేజాస్ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లు
విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం ‘ఇండ్‌శాట్’
భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం ‘ఇండ్‌శాట్’. త్వరలో కొత్త విద్యా విధానం. విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం. నేషనల్ పోలీస్ వర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీ ఏర్పాటు. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు. జిల్లా ఆస్పత్రులతో మెడికల్ కాలేజీల అనుసంధానం. విద్యా రంగానికి రూ.99,300కోట్లు
- విద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి
- 2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కొత్త కోర్సులు
- ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
- నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం
- భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్ పరీక్షలు
- ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీ
- 2030 నాటికి అత్యధికంగా పనిచేయగలిగిన యువత ఉండే దేశంగా భారత్
- దేశవ్యాప్తంగా స్థానికసంస్థల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు అప్రెంటీస్ విధానం
- 2026 నాటికి 150 విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులు
- విద్యారంగానికి రూ.99,300 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3వేల కోట్లు
- వర్సిటీల కోసం త్వరలో జాతీయస్థాయి విధానం
- రైలు మార్గాల ఇరు పక్కల సోలార్ కేంద్రాల ఏర్పాటు
- చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే. 2వేల కి.మీ. హైవేల నిర్మాణమే లక్ష్యం. బెంగళూరుకు రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్ రైల్వే వ్యవస్థ. కేంద్రం 20శాతం, అదనపు నిధుల ద్వారా 60శాతం సమీకరణ. రైలు మార్గాల ఇరు పక్కల సోలార్ కేంద్రాల ఏర్పాటు. పర్యాటక కేంద్రాలతో తేజస్ రైళ్లు. 11వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ. ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు.
- రైలు మార్గాల ఇరు పక్కల సోలార్ కేంద్రాల ఏర్పాటు. పర్యాటక కేంద్రాలతో తేజస్ రైళ్లు.
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 150రైళ్లు
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 150రైళ్లు. విద్యుత్ రంగానికి రూ.22వేల కోట్లు. రవాణా రంగానికి రూ.70లక్షల కోట్లు.
- లక్ష గ్రామాలకు ఓఎఫ్‌సీ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ. జాతీయ గ్రిడ్‌తో లక్ష గ్రామాల అనుసంధానం.
- నేషనల్ గ్యాస్ గ్రిడ్‌ను 16,300 కి.మీ. నుంచి 27వేల కి.మీ.లకు పెంచే దిశగా చర్యలు. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీలో కొత్త సంస్కరణలకు మరిన్ని చర్యలు. లక్ష గ్రామాలకు ఓఎఫ్‌సీ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ. జాతీయ గ్రిడ్‌తో లక్ష గ్రామాల అనుసంధానం. అంగన్వాడీలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, పోలీస్‌స్టేషన్‌లకు డిజిటల్ అనుసంధానం.