Vallabhai Patel statue of unity worlds tallest statue to be inaugurated on october-31

Vallabhai Patel Statue of unity worlds tallest statue to be inaugurated on October-31

Vallabhai Patel Statue of unity worlds tallest statue to be inaugurated on October-31

The Statue of Unity is a monument dedicated to Indian independence movement leader Vallabhbhai Patel located on the river island called Sadhu Bet facing the Narmada Dam near Rajpipla in the Indian state of Gujarat.

Height: 182 m
Created: 31 October 2013
Designer: Ram V. Sutar
Dedicated to: Vallabhbhai Patel
Architect: Joseph Menna
Did you know: The total height of the ‘Statue of Unity’ is 182 metres or 597.11 feet.

అత్యంత ఎత్తయిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని అక్టోబర్‌ 31న ఆవిష్కరించనున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో సర్దార్‌ సరోవర్‌ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో 182 మీటర్ల  (597 అడుగుల )ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. పటేల్‌ 138వ జయంతి సందర్భంగా 2013 అక్టోబర్‌ 31న ప్రధాని మోదీ.. ఈ విగ్రహ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ విగహ్రాన్ని ‘ఐక్యతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ)’గా పిలుస్తారు. దేశానికి తొలి హోంమంత్రిగా పనిచేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్ఫూర్తిని కొనసాగించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం విగ్రహ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ జేఎన్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్‌ 31న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.

ఇప్పటివరకైతే చైనాలో హెనాన్ ప్రాంతంలో స్ప్రింగ్ టెంపుల్ పేర 420 ఫీట్ల ఎత్తుతో బుద్ధ విగ్రహం ఉన్నది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహాలు చైనా, భారత్, జపాన్, తైవాన్‌లలో ఉన్నాయి. స్వేచ్ఛకు ప్రతీకగా అమెరికాకు ఫ్రాన్స్ బహూకరించిన స్వేచ్ఛా విగ్ర హం ఇప్పుడు అమెరికా ఆధిపత్యానికి ప్రపంచ శక్తికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు ఆసియా దేశాలు కూడా విగ్రహాల పేరుతో తమ పాలనా విధానాలకు ప్రతీకగా చెప్పదల్చుకున్నాయి. ఈ నేపథ్యంలోంచే మన దేశంలోనూ పాలకులు తమదైన భవిష్యత్ దర్శనాలను, విధానాలకు ప్రతీక గా పెద్దపెద్ద విగ్రహాల రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ విధమైన విగ్రహాల ప్రతిష్ఠాపన దేశంలో పురాతన కాలం నుంచీ ఉన్నది. దీన్నే ఇప్పుడు మన పాలకులు తమదైన కుల రాజకీయాలకు ప్రతీకగా నిలుపుతున్నారు. అలాగే దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి తెచ్చిన తర్వాత ఆర్థిక ఏకత్వానికి, స్వేచ్ఛా మార్కెట్‌కు ప్రతీకగా కూడా ఈ విగ్రహాల ద్వారా చూపటానికి ప్రయత్నిస్తున్నారు. అతి పెద్ద సర్దార్ పటేల్ విగ్రహం ప్రతిష్ఠాపన ద్వారా బీజేపీ దేశంలో నెహ్రూకు పోటీగా పటేల్‌ను నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ తన పదేండ్ల పాలనా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించే క్రమంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2010లోనే గుజరాత్‌లో అంకురార్పణ చేశారు. అయితే మోదీ తన ఏకఛత్రాది పాలన గుజరాత్ లో సాగిన తర్వాత ఆయన కన్ను కేంద్రంపై పడింది. దీంతో పటేల్ విగ్ర హ ప్రతిష్ఠాపన ప్రక్రియ దేశం యావత్తు దృష్టిని ఆకర్షించే విధంగా నిర్మిం చతలపెట్టారు. అయితే ఇదే గడ్డమీద పుట్టి దేశాన్ని ఏకతాటిపై నడిచిన గాంధీ బీజేపీ వారికి కనిపించకపోవటం విశేషం. బీజేపీ తనదైన విధానాలతో ముందుకుపోయే క్రమంలో (లోహ పురుష్) ఉక్కుమనిషిగా పిలువబడుతున్న సర్దార్ పటేల్‌ను తమ ఆదర్శంగా ప్రకటించుకొని సాగుతున్నది. అదే క్రమంలో బక్కపలుచని వ్యక్తిగా శాంతి కాముకునిగా పేరుగాంచిన గాంధీని పక్కనపెట్టి కండ బలానికి ప్రతీకగా సర్దార్ పటేల్ ను బీజేపీ తమ ఆదర్శ పురుషునిగా ప్రకటించుకుంటున్నది.