అసలు స్టైరీన్ అంటే ఏమిటి? ఇది రసాయనికంగా దీని యొక్క రూపం ఎలా ఉంటుంది

అసలు స్టైరీన్ అంటే ఏమిటి? ఇది రసాయనికంగా దీని యొక్క రూపం ఎలా ఉంటుంది

What is Styrene, the gas that leaked from Visakhapatnam plant.
Styrene gas leakage at LG Polymers Plant in the city of Visakhapatnam in Andhra Pradesh early Thursday morning has claimed many lives. Know what exactly styrene is and how it affects the human body.

విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి విడుదలైన స్టైరీన్ అనే వాయువు ప్రభావంతో ఫ్యాక్టరీ చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తెల్లవారుజామున జరగడం వాళ్ళ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు

What is Styrene

అసలు స్టైరీన్ అంటే ఏమిటి? ఇది రసాయనికంగా దీని యొక్క రూపం ఎలా ఉంటుంది. ఇది మనుషులపై మరియు జంతువులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం

విశాఖ LG పాలిమర్స్ నుంచి లీక్ అయిన గ్యాస్ స్టైరీన్(Styrene) దీని మాలిక్యులర్ రూపం C6H5CHCH2. దీనినే వినైల్ బెంజీన్, Ethenylbenzene, Cinnamene అని కూడా పిలుస్తారు. బెంజీన్, ఎథిలీన్ వంటి రసాయన మిశ్రమాల చర్యతో ఇది ఉత్పత్తి అవుతుంది. ఇది రంగులేని ద్రవం, వాసన ఉండవు కానీ చాలా వేగంగా ఇది గాల్లో కలసిపోతుంది. ముఖ్యంగా గాఢంగా ఉన్న ఈ వాయువును పీల్చినప్పుడు, ముక్కు, గొంతు భాగాలు ముందుగా దీని ప్రభావానికి గురవుతాయి. ఆ తర్వాత నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అధిక మోతాదులో ఈ వాయువు పీల్చినప్పుడు విపరీంగా కళ్లు తిరగడం, తలనొప్పి, తుమ్ములు, దగ్గు, వాంతులవ్వడం, శరీరంలో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించడం, కళ్లు తిరగడం, నిలబడలేకపోవడం, అయోమయ స్థితిలోను కావడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. ఒక్కోసారి మనిషి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది.

Latest Updated Posts

సాధారణంగా ఈ స్టైరీన్ ను ద్రవరూపంలో రిఫ్రిజరేషన్ స్థితిలో చల్లటి వాతావరణంలో ఉంచుతారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇది గాలిలో కలసిపోతుంది. ఈ స్టైరీన్ ను ఎక్కువ కాలం నిల్వ చేస్తే కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది. ఇది మండే స్వభావం కల ద్రవం. ఇది గాలిలో తేలికగా ఆవిరైపోయి వేగంగా వ్యాపిస్తుంది .

దీనిని ప్లాస్టిక్, డిస్పోజబుల్ కంటైనర్లు, సింథటిక్ రబ్బర్ వంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు. ప్లాస్టిక్, సింథెటిక్ రబ్బర్ తయారీ లో ముడిసరుకు కాబట్టి నిత్యజీవింలొ ఎంతో విస్తృతప్రయోజన మున్న వస్తువులను తయారు చేసేందుకు స్టైరీన్ ఉపయోగిస్తారు. ఇంకా పాకేజింగ్ ఇండస్ట్రీ లో పాలిస్టైరీన్ ప్లాస్టిక్ రూపంలో దీనిని వినియోగిస్తారు. డిస్పోజబుల్ కాఫీ గ్లాస్లులు తయారేది కూడా ఈ ప్లాస్టిక్ తోనే. రెసిన్ అంటే ఫైబర్ గ్లాస్ ను తయారు చేసేందుకు స్టైరీన్ అవసరం.ఇన్సులేషన్లు సామాన్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్రింటింగ్ కాట్రిడ్జిలు, ఆహారం నిల్వఉండే కంటైనర్లు, కార్పెట్ అడుగున బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్ , రబ్బర్ లను తయారుచేసేందుకు స్టైరీన్ అవసరం.ఇది క్యాన్సర్ కు కారకం అని కొన్ని పరిశోధనలలో తేలింది. స్టైరీన్ పీల్చుకున్నపుడు గోంతులోని మ్యూకస్ పొర మీద పనిచేస్తుంది. ఎక్కువ మోతాదులో స్టైరీన్ ను పీల్చుకున్నపుడు (376 పిపిఎమ్ 25 నిమిషాలపాటు) వాంతి సెన్సేషన్ వస్తుంది. తర్వాత స్పృహ కోల్పోతారు. ఇతర దుష్ప్రభావాలకు సంబంధించి తలనొప్పి రావడం, చర్మం మీద దురద పుట్టడం జరుగుతుంది. కళ్లు మండుతాయి. ఈ వాాయువు విషవాయువే కాని అంత ప్రాణాంతకం కాదు.

నిజానికి దాల్చిన చెక్క, కాఫీ బీన్స్, వేరుశెనగ గింజల్లో ఇది అత్యంత తక్కువ మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. మోటారు వాహనాల పొగ, పొగాకు సంబంధిత పొగ నుంచి కూడా ఇది కొద్ది పాటి స్థాయిలో విడుదల అవుతుంది. సహస సిద్ధంగా ఉండే స్టైరీన్ కన్నా…. పాలిమర్లతో రసాయన ప్రక్రియల వల్ల తయారయ్యే స్టైరీన్ అత్యంత ప్రమాదకరమైనది. దీన్ని పీలిస్తే… వెంటనే నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

ఎల్ జి పాలిమర్స్ అనేది హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో 1961లో ప్రారంభమైంది. 1978లో దీన్ని యూబీ గ్రూప్ తీసుకుంది. 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కంపెనీ టేకోవర్ చేసి, పేరు ఎల్జీ పాలిమర్స్‌గా పేరు మార్చింది. పాలిస్టిరైన్, ఎక్స్‌పాండబుల్ పాలిస్టిరైన్ (థర్మాకోల్) వంటివి ఈ సంస్థలో తయారవుతాయి.

 

Latest Updated Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.