తెలంగాణలో 5 నగరాల్లో ఫ్రీ వైఫై – వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, రామగుండం

223 total views, 3 views today

Home>>Daily Current Affairs

తెలంగాణలో 5 నగరాల్లో ఫ్రీ వైఫై -వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, రామగుండం

తెలంగాణలో 5 నగరాల్లో ఫ్రీ వైఫై

– తెలంగాణలోని 5 నగరాల్లో ఉచిత వైఫై సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– ఇందుకోసం వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు సర్వీసు ప్రొవైడర్లకు కొన్ని రాయితీలను ఇవ్వనుంది.
– ఈ మేరకు ఐటీశాఖ 2018 జనవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది.
– హైదరాబాద్‌ సిటీ వైఫై ప్రాజెక్టు, హైఫై విజయవంతమైన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– నగరాల్లో నివసించే ప్రజలు, పర్యాటకులు, సందర్శకులకు సేవలందించి ఉచిత సమాచారం తెలుసుకునేందుకు వీలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Related Articles:

  • కౌమార దశ నిర్వచనాన్ని మార్చాలని శాస్త్రవేత్తల అభిప్రాయం
  • – మారిన ఆరోగ్య, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కౌమార దశ నిర్వచనాన్ని కూడా మార్చాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
    – ప్రస్తుతం 14-19 సం॥ వయసు మధ్య కాలాన్ని కౌమార దశగా పరిగణిస్తున్నారు.
    – దీన్నే టీనేజ్‌గా వ్యవహరిస్తుంటారు. మెదడులోని హైపోథామస్‌ ప్రాంతంలో హార్మోన్లు విడుదలై లైంగికపరమైన మార్పు చేటుచేసుకోవడాన్ని కౌమారదశ ఆరంభంగా గుర్తిస్తున్నారు.
    – సాధారణంగా ఇది 14వ ఏట ప్రారంభమవుతుంది.
    – అయితే పౌష్టికాహారం లభ్యత ఇతర కారణాల పదో ఏటలోనే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి.
    – ఇంగ్లండ్‌ వంటి పారిశ్రామిక దేశాల్లో గత 150 సం॥ల గణాంకాలను పరిశీలిస్తే బాలికల్లో 12-13 సం॥ల వయసులోనే రుతుక్రమం ప్రారంభమవుతోంది.
    – దాంతో పాటు చదువు కారణంగా 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎవరూ పెళ్లిమాటే ఎత్తడం లేదు.
    – అంటే యవ్వనం వచ్చినా బాధ్యతపరంగా వారు కౌమార దశలో ఉన్నట్టే.
    – అందువల్ల 10-25 సంవత్సరాల మధ్యనున్న కాలాన్ని కౌమార దశగా పరిగణిస్తే బాగుటుందని సిఫార్సు చేశారు.
    – ఇందుకుసంబంధించి లాన్సెట్‌ ఛైల్డ్‌ అండ్‌ అడోల్‌సెంట్‌ హెల్త్‌ జర్నల్‌లో వ్యాసం ప్రచురితమైంది.


    People Also Search This Post Using Following Keywords:
    current affairs telugu, telugu current affairs, current affairs in telugu, telugu current affairs material, daily current affairs.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.