amazon and flipkart

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో 1.40 లక్షల ఉద్యోగాలు

818 total views, 1 views today

amazon and flipkart

ఈ–కామర్స్‌ సంస్థలు పండుగల సీజన్‌లో భారీ తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు భారీ ధమాకా సేల్స్‌కు సిద్ధమయ్యాయి. ఈ నెల 29వ తేదీ నుంచి ఎలక్ట్రానిక్స్ మరియు అప్లియెన్సెస్ మీద 70 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి.దసరా, దీపావళి పండుగల సందర్బంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అయితే ఇవి తాత్కాలికమే.

అమెజాన్‌లో 90,000 ఉద్యోగాలు
దసరా, దీపావళి పండుగ సీజన్ కావడంతో భారీ అమ్మకాల నేపథ్యంలో 90,000 మందిని తాత్కాలికంగా క్రమబద్ధీకరణ కేంద్రాలు, డెలివరీ స్టేషన్స్, కస్టమర్ సేవా వంటి విభాగాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాదే, పుణేలలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటామని అమెజాన్ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌లో 50,000 ఉద్యోగాలు

ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ పండుగ సీజన్‌లో తాత్కాలికంగా 50,000 మంది ఉద్యోగాలను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. సప్లై చైన్, కస్టమర్ సపోర్ట్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో ఉద్యోగుల అవసరం ఉందని తెలిపింది. అయితే ఇవి తాత్కాలిక ఉద్యోగాలు. దసరా, దీపావళి పండుగ సీజన్లో సేల్స్ పెద్ద ఎత్తున ఉంటాయి. ఆఫర్లు కూడా ఇస్తుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.