Current Affairs Telugu 10 October 2017
Current Affairs Telugu 10 October 2017
- 2017 చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత రాఫెల్ నాదల్
- మాత అమృతానందమయి మఠ్ ప్రాజెక్టు ‘జీవామృతం’ ప్రారంభం
- అనుపమ రామచంద్రన్‌కు స్నూకర్ చాంపియన్‌షిప్ 2017
- కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులు
- చంద్రబాబుకు గోల్డెన్ పీకాక్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లండన్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐఓడీ) సంస్థ ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని అందించనుంది. లీడర్షిప్ ఇన్ పబ్లిక్ సర్వీస్, ఎకనమిక్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో చంద్రబాబుకు ఈ పురస్కారం దక్కింది.
- ప్రపంచ యూత్ ఆర్చరీలో భారత జోడీకి స్వర్ణం
ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ టీమ్ రికర్వ్‌లో నింగ్తౌజామ్-అంకితా భకత్ జోడీ స్వర్ణం గెలుచుకుంది. అర్జెంటీనాలోని రొసారియోలో జరిగిన ఫైనల్లో తొమ్మిదో సీడ్ భారత జంట 6-2తో టాప్ సీడ్ రష్యాకు షాకిచ్చింది. 2011లో దీపిక కుమారి విజయం తర్వాత యూత్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి ప్రపంచ టైటిల్. టోర్నీలో భారత్ మరో రజతం, కాంస్యం సాధించింది.