Current Affairs Telugu 19 July 2017 | Current Affairs Today

Current Affairs Telugu 19 July 2017 | Current Affairs Today

Current Affairs Telugu 19 july 2017


Current Affairs Telugu 19 July 2017 | Current Affairs Today

Current Affairs Today 19 july 2017

 

 

కోల్‌కతలో ప్రపంచ వ్యాపార సదస్సు
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతలో 2017 నవంబర్‌ 26, 27 తేదీల్లో ప్రపంచ వ్యాపార సదస్సు జరగనుంది. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి.
3డీ ప్రింటెడ్‌ సాఫ్ట్‌ సిలికాన్‌ హృదయాన్ని అభివృద్ధి చేసిన స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు
స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్‌ జ్యూరిచ్‌ శాస్త్రవేత్తలు 3డీ ప్రింటెడ్‌ సాఫ్ట్‌ సిలికాన్‌ హృదయాన్ని అభివృద్ధి చేశారు. ఇది అచ్చం మానవ హృదయాన్ని పోలి ఉంది. మానవ హృదయం వలె పని చేయలేకపోయినప్పటికీ హృద్రోగ బాధితులకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కృత్రిమ హృదయం 390 గ్రాముల బరువు ఉంటుంది.
దాల్‌ సరస్సులో ‘కల్చర్‌ ఆన్‌ క్రూయిజ్‌’
వివిధ రంగాల్లోని కళాకారులందరినీ ఒకే వేదికపై చేర్చడం కొరకు జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం దాల్‌ సరస్సులో ‘కల్చర్‌ ఆన్‌ క్రూయిజ్‌’ పేరిట వారం పాటు సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించింది.
మొట్టమొదటి కార్గిల్‌ ఇంటర్నేషనల్‌ మారథాన్‌ ‘రన్‌ ఫర్‌ సర్హాద్‌’
మొట్టమొదటి కార్గిల్‌ ఇంటర్నేషనల్‌ మారథాన్‌ ‘రన్‌ ఫర్‌ సర్హాద్‌’ను 2017 జులై 16 నుంచి 18 వరకు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 మంది రన్నర్స్‌ ఇందులో పాల్గొన్నారు. 60 కి.మీ. విభాగంలో జహీర్‌ అబ్బాస్‌, 120 కి.మీ.ల విభాగంలో సర్ఫరాజ్‌ రహమాన్‌ విజేతలుగా నిలిచారు.