Current Affairs Telugu 28 July 2017 | Current Affairs Today

83 total views, 1 views today

Current Affairs Telugu 28 July 2017 | Current Affairs Today

Current Affairs Telugu 28 july 2017

Current Affairs Telugu 28 July 2017 | Current Affairs Today

Current Affairs Telugu 28 July 2017 | Current Affairs TodayCurrent Affairs Today 28 july 2017

 

ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ గురుకుల విద్యార్థినులు
నిత్యం మంచుతో నిండి, ప్రమాదకరమైందిగా భావించే రష్యాలోని ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు మాలావత్‌ పూర్ణ, బొల్లెద్దు శ్రీవిద్య అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. రష్యాలో, ఐరోపా ఖండంలో ఎత్తయిన ఈ పర్వత శిఖరాగ్రానికి పూర్ణ, శ్రీవిద్యలు 2017 జులై 26న చేరుకుని పర్వతారోహణను విజయవంతంగా పూర్తిచేశారు. ఎవరెస్టును అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించిన మాలావత్‌ పూర్ణ ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలలో, బొల్లెద్దు శ్రీవిద్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్నారు. తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు శేఖర్‌బాబు ఆధ్వర్యంలో బృందంతో కలిసి వీళ్లు పర్వతారోహణకు వెళ్లారు. ఎల్‌బర్స్‌ను అధిరోహించేందుకు మన దేశం నుంచి వెళ్లిన ఐదుగురిలో ఇద్దరు తెలంగాణ వారే. తెలంగాణలో 53 గురుకుల డిగ్రీ కళాశాలలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పూర్ణ, శ్రీవిద్యలు ఎల్‌బ్రస్‌ పర్వతంపై సీఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని, తెలంగాణ రాజముద్రను పెట్టారు. జాతీయ పతాకాన్ని నాటారు.

ఎల్‌బ్రస్‌ నేపథ్యం..

– మౌంట్‌ ఎల్‌బ్రస్‌ ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాల్లో ఒకటి.

– ఆసియా, ఐరోపా సరిహద్దుగా భావించే కాకాసస్‌ పర్వతశ్రేణిలో మౌంట్‌ ఎల్‌బ్రస్‌ ఉంది.

– కాకాసస్‌ పర్వతశ్రేణి మధ్య ఆసియా, ఐరోపాతో రష్యాను వేరుచేస్తూ ఉంటుంది.

– ఎల్‌బ్రస్‌ ఎత్తు తూర్పున 18,442 అడుగులు, పడమట 18,510 అడుగులు ఉంటుంది.

– ఈ ప్రాంతం నుంచి బాక్సన్‌, మాల్కా, కుబన్‌ నదులు ప్రారంభమవుతాయి.

కె.గోపాలన్‌కు 2017 నేషనల్‌ ఎర్త్‌ సిస్టమ్‌ సైన్సెస్‌ లైఫ్‌టైమ్‌ ఎక్సలెన్స్‌ అవార్డు
ప్రొఫెసర్‌ కె.గోపాలన్‌కు 2017 సం॥నికి గాను నేషనల్‌ ఎర్త్‌ సిస్టమ్‌ సైన్సెస్‌ లైఫ్‌టైమ్‌ ఎక్సలెన్స్‌ అవార్డులో లైఫ్‌టైమ్‌ ఎక్సలెన్స్‌ అవార్డు లభించింది. నేషనల్‌ ఎర్త్‌ సైన్సెస్‌ శాఖను ఫౌండేషన్‌ డే సందర్భంగా 2017 జులై 27న ఈ అవార్డు అందజేశారు.

ఇతర అవార్డులు

ఓషియన్‌ సైన్స్‌ & టెక్నాలజి ప్రొ॥ పి.యన్‌.వినయచంద్రన్‌

అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌ & టెక్నాలజి డా॥ కె.కృష్ణమూర్తి

జియో సైన్స్‌ & టెక్నాలజి ప్రొ॥ కె.యస్‌.కృష్ణ

యంగ్‌ రీసెర్చర్‌ అవార్డు డా॥ ధన్య సి.టి., డా॥ విక్రమ్‌ విశాల్‌

చైనాలో 2017 బ్రిక్స్‌ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్స్‌ సమావేశం
2017 బ్రిక్స్‌ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్స్‌ సమావేశం చైనాలోని బీజింగ్‌లో 2017 జులై 27న జరిగింది. ఈ సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ ధోవల్‌ హాజరయ్యారు.
పాస్‌పోర్ట్‌కు బర్త్‌ సర్టిఫికెట్‌ అక్కర్లేదు
పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఇకపై బర్త్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు. ఇప్పటి వరకూ బర్త్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే పాస్ట్‌పోర్ట్‌ వచ్చే అవకాశం ఉండేది. తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌ల జారీని సరళతరం చేసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలకు విదేశీ మంత్రిత్వ శాఖ 2017 జులై 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ గుర్తింపు కార్డుతోనైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.