Current Affairs Bits: May 2017

CURRENT AFFAIRS BITS MAY – 2017

రాష్ట్రీయం

1) మానేరు తీరాన్ని ఎలా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది?
జ. సబర్మతి నదీతీరాన్ని అభివృద్ధి చేసినట్టు
( నోట్: అహ్మదాబాద్ లో సబర్మతి నది ప్రవహిస్తుంది.)
2) ఆర్థిక సంవత్సరాన్ని ఏ నెల నుంచి మొదలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది?
జ. జనవరి నుంచి డిసెంబర్
(నోట్: ఆర్థిక సంవత్సరాన్ని మార్చుతున్నట్టు గతంలోనే మధ్యప్రదేశ్ ప్రకటించింది)
3) తెలంగాణలోని ఏ థర్మల్ పవర్ ప్లాంటుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లభించింది?
జ. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్
(నోట్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నెలకొల్పే ఈ ప్లాంట్ సామర్థ్యం 400 మెగా వాట్లు. దీనికి 2,800 ఎకరాల భూమి కావాలి. జూన్ 8, 2015న దీనికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.)
4) రాష్ట్రంలోని ఏ విమానాశ్రయంలో నూటికి నూరు శాతం LED బల్బులను అమర్చనున్నారు ?
జ: శంషాబాద్ విమానాశ్రయం ( 20 వేల బల్బులు)
5) ప్రతి యేడు జూన్ నెలలో వచ్చే రుతుపవనాలను ఏమంటారు ?
జ: నైరుతి రుతుపవనాలు

జాతీయం

6) బినామీ లావాదేవీలకు సంబంధించి ఏ ప్రముఖుల ఇళ్లలో సీబీఐ, ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది?
జ. కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం కుమారుడు కార్తి, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్
7) తెలుగు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతున్న సంస్థ ఏది?
జ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ ( ఇందులో కమిషనర్లుగా ఉన్నవారి పదవీకాలం పూర్తైంది. తెలంగాణ కోసం ఇంత వరకు ప్రత్యేక సమాచార కమిషన్ ఏర్పాటు కాలేదు)
8) ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 అధికారిగా నియమితులుకానున్న క్రీడాకారిణి ఎవరు?
జ. ఒలింపిక్ విజేత పి.వి.సింధు.
(నోట్: ఈ నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాన్ని సవరించింది)
9) అప్రకటిత నగదు వెలికితీసేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వెబ్ పోర్టల్ ఏది?
జ. ఆపరేషన్ క్లీన్ మనీ
10). పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయ పన్ను పరిధిలోకి కొత్తగా ఎంత మంది చేరారు?
జ. 91 లక్షల మంది.
(వీళ్లంతా కొత్తగా పన్ను రిటర్నులు సమర్పించారు)
11) వందేళ్ల పాటు బీమా సదుపాయం కల్పించే LIC కొత్త పాలసీ ఏది?
జ. జీవన్ ఉమంగ్
12) 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా LIC ఆర్జించిన మొత్తం ఎంత?
జ. రూ.19,000 కోట్లు
( గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 72 శాతం ఎక్కువ)
13) జమ్నాలాల్ బజాజ్ ఎవరు?
జ. బజాజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు
( 1926లో దీన్ని నెలకొల్పారు. జమ్నాలాల్ ను మహాత్మ గాంధీ తన ఐదో కుమారుడిగా భావించే వారు)
14) పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇందులో మొదటి, మూడు స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి?
జ: చైనా, భారత్, అమెరికా
15) 2017 లో ప్రపంచ బ్యాంకు రూపొందించిన విద్యుత్ అందుబాటులో ఉన్న దేశాల జాబితాలో భారత్ స్థానం ఎంత ?
జ: 26 వ దేశం
(2014 లో 99 – దేశంలోని గ్రామీణ ప్రాంతాలను విద్యుదీకరణ చేస్తుండటంతో ర్యాంకు మెరుగుపడింది)
16) ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి ఎస్. రామస్వామి ఏ రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వారు ?
జ: పుదుచ్చేరి
17) జాతీయ పర్యావరణ విపత్తుల నివారణ సంస్థ రెండో సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: న్యూఢిల్లీ (మే 15,16
18) 2017 ఆసియాన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో మొదటగా బంగారు పతకం గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు ?
జ: బజరంగ్ పూనియా (65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో)
19) వారణాసిని స్మార్ట్ సిటీగా మార్చేందుకు బ్రిటీష్ జియోలాజికల్ సర్వే సంస్థ ఏ IIT తో కలసి పనిచేస్తోంది
జ: IIT ఖరగ్ పూర్
20) ఫిక్కీ రూపొందించిన ఎకనమిక్ ఔట్ లుక్ సర్వే ప్రకారం 2018 ఆర్థిక సంవత్సరానికి భారత్ GDP ఎంత ఉంటుందని అంచనా వేశారు ?
జ: 7.4శాతం
21) నందన్కన్నన్ జూలజికల్ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: ఒడిషా
22) నేషనల్ డెంగ్యూ డే ఎప్పుడు ?
జ: మే 16
23) నర్మదా నది ఏ ప్రదేశంలో పుట్టింది ?
జ: అమరకంటక్

అంతర్జాతీయం

24) ప్రపంచ దేశాలను వణికిస్తున్న వాన్న క్రై మూలాలు ఎక్కడున్నట్టు కనుగొన్నారు?
జ. ఉత్తర కొరియా.
25) వాన్న క్రై మూలాలు ఉత్తరకొరియాలో ఉన్నట్టు కనుగొన్నది ఎవరు?
జ. లండన్ లో ఉంటున్న NRI నీల్ మెహతా (ఇతను గూగుల్ లో పనిచేస్తున్నారు)
26) 2017 ఫార్ములా 1 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ను గెలుచుకున్నదెవరు ?
జ: లూయిస్ హామిల్టన్
27) యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ ( UNFCCC) కి డిప్యూటీ ఎక్జిక్యూటివ్ సెక్రటరీగా ఎంపికైన భారతీయుడు ఎవరు ?
జ: ఓవైస్ సార్మడ్
28) ప్రపంచంలోనే రద్దీగా ఉండే సింగల్ రన్ వే ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది ?
జ: ముంబై ఎయిర్ పోర్ట్, భారత్
29) ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ దేశ జట్టుకు గుజరాత్ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది ?
జ: న్యూజిలాండ్
30) తమిళనాడుకు చెందిన 18 యేళ్ళ యువకుడు ప్రపంచంలోనే చిన్న శాటిలైట్ తయారు చేశాడు. దాని పేరేంటి ?
జ: కలాంశాట్
31) “India’s Indira : A Centennial Tribute” ఎవరి రచన ?
జ: ఆనంద్ శర్మ
32) టెక్స్ట్ లాగే వాయిస్ కూడా ఎడిట్ చేయగలిగే కొత్త సాఫ్ట్ వేర్ పేరేంటి?
జ. వోకో (VoCo)