Daily Current Affairs :15-may-2017

Daily Current Affairs 15-may-2017

రాష్ట్రీయం

1) తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అభయహస్తం పథకం దేనికి సంబంధించినది?
జ. స్వయం సహాయక మహిళా సంఘాలకు పింఛను అందించే పథకమిది.

2) విద్యుత్ డిమాండ్ లో తెలంగాణ ఏ స్థానంలో ఉంది?
జ. పదో స్థానం.

3) దివ్యాంగులకు అంగవైకల్య శాతాన్ని గుర్తిస్తూ జారీ చేసే పత్రాన్ని ఏమంటారు ?
జ: సదరం ధృవపత్రం

4) ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదికగా దేన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్

5) జ్ఞాపకాల వరద పుస్తక రచయిత ఎవరు?
జ. జి.ఎస్.వరదాచారి.

జాతీయం

6) అంతర్జాతీయ న్యాయస్థానంలో 18 యేళ్ళ తర్వాత కుల్భూషణ్ యాదవ్ కేసును భారత్ వేసింది. అంతకుముందు నడిచిన కేసు ఏంటి ?
జ: 1999 ఆగస్టు 10న పాక్ నావికాదళానికి చెందిన యుద్ధవిమానం అట్లాంటిక్ ను కుచ్ ప్రాంతంలో భారత్ కూల్చింది. భారీ నష్టపరిహారం కోసం పాకిస్థాన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో భారత్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

7) కుల్భూషణ్ కేసు ది హేగ్ నగరంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. అయితే ది హేగ్ ఏ దేశంలో ఉంది ?
జ: నెదర్లాండ్స్ లో

8) 2030 కల్లా ఏ వ్యాధిని భారత్ లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: మలేరియా

9) HIV సోకిన తల్లులకు పుట్టే బిడ్డలకు ఆ వ్యాధి సోకకుండా చేపట్టిన చికిత్స ఏ రాష్ట్రంలో విజయవంతం అయింది ?
జ: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో

10) బీజింగ్ లో జరుగుతున్న BRF సదస్సును భారత్ బహిష్కరించింది. BRF అంటే ఏంటి ?
జ: Belt and Road Forum

11) బీఆర్ఎఫ్ సదస్సును భారత్ ఎందుకు బహిష్కరించింది ?
జ: చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా – అనేది పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళ్తోంది.

12) కాండం తొలచు పురుగును దరిచేరనీయకుండా జన్యమార్పిడితో ఏ పంటకు కొత్త వంగడాన్ని భారత తృణధాన్యాల పరిశోధనా సంస్థ రూపొందించింది ?
జ: జొన్న

13. ప్రపంచ పండ్ల ఉత్పత్తిలో భారత్ ది ఎన్నో స్థానం
జ. రెండో స్థానం

14. దేశంలో విరివిగా పండే పంట ఏది?
జ. అరటి.

15. సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ పోర్టల్ ఏది?
జ. నక్షే. (సర్వే ఆఫ్ ఇండియా 250 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. నక్షే అంటే పటాలు)

16. భారత్ లో పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రమేది?
జ. మహారాష్ట్ర

17. వేరుశనగ సాగులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
జ. గుజరాత్

18. నీలి విప్లవం దేనికి సంబంధించినది?
జ. చేపలు

19) ఇస్రో చరిత్రలోనే 640 టన్నుల GSLV మార్క్3 రాకెట్ ను జూన్ లో అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో ఏ ఇంజన్ ను ఉపయోగించనున్నారు ?
జ: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజిన్

అంతర్జాతీయం

20) అధిక వేడిని తట్టుకునే రబ్బరు లాంటి పదార్థాన్ని ఇటీవల కనుగొన్నారు. దాని పేరేంటి?
జ. థబ్బర్.

21) Up rise అంటే ఏమిటి?
జ. తిరుగుబాటు

22) నీలం శ్రేణిలోకి కొత్తగా చేరిన రంగేది?
జ. ఇన్ మిన్ బ్లూ ( (1802 లో ఫ్రాన్స్ శాస్త్రవేత్త లూయూ జాక్వెస్ “ కోబాల్ట్ బ్లూ” కనుగొన్నాక, నీలం వర్ణశ్రేణిలోకి మళ్లీ కొత్త రంగు ప్రవేశించడం ఇదే మొదటిసారి.)

23) ఎవరెస్టుపైకి 8సార్లు ఎక్కిన మహిళ పేరేంటి?
జ. నేపాల్ కు చెందిన పర్వతారోహకురాలు లక్సా షెర్ఫా ( 44 ఏళ్లు)

24 ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
జ. ఇమాన్యూయెల్ మెక్రాన్

25. 2017 ఆర్కిటిక్ ఎనర్జీ సమిట్ ఎక్కడ జరగనుంది?
జ. ఫిన్ ల్యాండ్ రాజధాని హెల్సెంకీ. సెప్టెంబర్ లో ఈ సదస్సు జరగనుంది.

26) మాడ్రిడ్ ట్రోఫీలో మహిళల సింగిల్స్ ఫైనల్లో విజేత అయింది ఎవరు ?
జ: సిమోన హాలెప్ (రొమేనియా)