Daily Telugu Current Affairs Highlights 13 March 2018
Daily Telugu Current Affairs Highlights 13 March 2018
>ఇండియాకు 2018 బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డు లభించింది. 2018 మార్చి 7 నుంచి 10 వరకు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఐటీబీ-బెర్లిన్ వరల్డ్ టూరిస్ట్ మీట్‌ను నిర్వహించారు
>టైమ్స్ నౌ నెట్వర్క్ చీఫ్, టైమ్స్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు రంజన్‌రాయ్(57) 2018 మార్చి 10న న్యూడిల్లీలో మృతి చెందాడు
>‘లిటిల్ బ్లాక్ డ్రెస్’ తో ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించిన ప్రముఖ ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ హుబెర్ట్ డి గివెన్చీ(91) 2018 మార్చి 10న పారిస్‌లో మృతి చెందారు
>భారత పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రధాని నరేంద్రమోడితో కలిసి 2018 మార్చి 12 న యూపీలోనే అతిపెద్దదైన రూ.500 కోట్ల సౌర విద్యుదుత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించారు
>ప్రఖ్యాత రష్యా రచయిత లియో టాల్‌స్టాయ్ రాసిన అరుదైన లేఖ వేలంలో రూ.13.94 లక్షలు (21,450 డాలర్లు) పలికింది
>ప్రముఖ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్‌కు గోదావరి గౌరవ్ అవార్డు లభించింది
>కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ప్రభు 2018 మార్చి 10న కేంద్ర విమానయాన శాఖను అదనపు బాధ్యతగా చేపట్టారు
>ఆన్లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ పేటిఎం ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు 5 సం॥ వరకు అంపైర్ పార్ట్నర్గా మారింది
One thought to “Daily Telugu Current Affairs Highlights 13 March 2018”