Governor Speech at Telangana Assembly Budget Session

Governor Speech at Telangana Assembly Budget Session

Governor Speech at Telangana Assembly Budget Session

Governor Speech at Telangana Assembly Budget Session

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం ప్రారంభమైంది. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అసెంబ్లీ వేదికగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నరసింహన్ అన్నారు.

Current Affairs Magazine March 2018
Telugu Monthly Current Affairs e-Magazine March-2018 Download as PDF FREE

రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు సాఫీగా సాగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు.దేశంలో అత్యంత పిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచింది.

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు పొందింది. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టింది. మేజర్, మీడియం నీటి ప్రాజెక్టులను నిర్మిస్తూ కృష్ణా, గోదావరి జలాలను పొలాలకు మళ్లిస్తున్నం.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. 23 భారీ, 13 మధ్యతరహా సాగునీటిప్రాజెక్టులను చేపట్టాం. మిషన్ కాకతీయ కింద చెరువులను పునరుద్దరించుకున్నాం. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయి.

వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టాం. 35.3 లక్షల మంది రైతులకు లక్ష లోపు రుణమాఫీ చేసినం. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. విజయవంతంగా భూ రికార్డుల ప్రక్షాళన చేసినం. త్వరలోనే రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తం

మేజర్, మీడియం నీటిపారుదల ప్రాజెక్టుల పనులు శరవేగంగా నడుస్తున్నాయని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని. అందువల్లే ప్రభుత్వం రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ అందిస్తోందన్నారు.సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ముందున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 23లక్షల పంపు సెట్లకు 24 గంటల ఉచిత విద్యు‌త్‌ అందిస్తున్నట్ల వెల్లడించారు.ప్రతి పల్లెకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.

ఇంటింటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ చేపట్టాం. 95శాతం మిషన్ భగీరథ పనులు పూర్తి అయినాయి. మిషన్ భగీరథపై దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాం. పలు రాష్ర్టాల అధికారులు వచ్చి మిషన్ భగీరథ పనుల గురించి తెలుసుకుంటున్నారు. విద్యుత్ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించినం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తున్నాం. ప్రతి ఏడాది ఆర్ధికాభివృద్ధిరేటు సాధిస్తున్నాం. ఉమ్మడి ఏపీలో జీఎస్‌డీపీ 4 శాతం మాత్రమే ఉండేది. ఇది జాతీయ సగటు కంటే 1.9 శాతం తక్కువ. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి మారింది. గడిచిన మూడేళ్లలో సరాసరి 8.6 శాతం చొప్పున జీఎస్‌డీపీ సాధిస్తున్నాం.
జాతీయ సరాసరి సగటు 7.5 కంటే 1.1 శాతం అధికంగా జీఎస్‌డీపీ సాధించాం. 2016-17లో రాష్ట్ర తలసరి ఆదాయం లక్షా 54 వేలు. జాతీయ తలసరి ఆదాయం కేవలం లక్షా 3వేలు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ప్రభుత్వ ప్రణాళికతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ అద్భుతంగా అమలవుతుంది. గొల్ల కురుమలకు 75శాతం సబ్సీడీతో గొర్రెలను అందిస్తున్నం.
పీపీపీ పద్దతిలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించినం. పచ్చదనం పెంచేందుకు తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినం.

కేసీఆర్ కిట్‌కు మంచి స్పందన లభిస్తుంది. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. నాణ్యమైన విద్యను అందించేందుకు 517 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించాం.

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. టీఎస్‌ఐపాస్‌తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఐటీ హబ్‌లతో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం. త్వరలోనే టీహబ్-2ను ప్రారంభిస్తున్నాం. బుద్వేల్‌లో ఐటీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం.

Daily Telugu Current Affairs

Daily  English Current Affairs

Telugu General Essays

Telugu Current Affair Bits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.