గ్రూప్ 3 ప్రిలిమ్స్ పరీక్షలో వ్యోమ టెస్ట్ సిరీస్ నుండి 68 ప్రశ్నలు ?
గ్రూప్ 3 ప్రిలిమ్స్ పరీక్షలో వ్యోమ టెస్ట్ సిరీస్ నుండి 68 ప్రశ్నలు ?
21-ఏప్రిల్ -2019న జరిగిన గ్రూప్ 3 పరీక్షలో మా టెస్ట్ సిరీస్ నుండి 68/150 ప్రశ్నలు వచ్చినందుకు మేము గర్విస్తున్నాం, అంతేగాక మేము ప్రతి రోజు అందించిన కరెంటు అఫైర్స్ మరియు ఎగ్జాం గైడెన్స్ వీడియోస్ అభ్యర్థులకు ఎంతగానో ఈ పరీక్ష లో ఉపయోగపడినవి అని తెలియజేయటానికి సంతోషిస్తూ, ఇక మీదట కూడా వ్యోమ నుండి అభ్యర్థులకు అత్యంత నాణ్యమైన మరియు ఉపయోగకరమైన సమాచారం అందించడానికి మా వంతు ప్రయత్నంలో మీ వంతు సాయ సాకారాలు మరియు ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని భావిస్తూ అతి త్వరలో జరగబోయే గ్రూప్ 2 పరీక్షకు 3000 రూపాయల ప్యాకేజీని కేవలం 600 రూపాయలకు అందిస్తున్నాం.
ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకొని అసలైన పరీక్ష లో విజయం సాధించాలని కోరుకుంటున్నాం.
Register For Group 2 Test Series
Group 3 Prelims 2019 Question Paper
Group 3 Prelims 2019 Question Paper Question No With Vyoma Test Series Q.id
ఇక్కడ సెట్ ఏ కి సంబందించిన ప్రశ్నాపత్రం లో వ్యోమ టెస్ట్ సిరీస్ నుండి వచ్చిన ప్రశ్నలను ప్రశ్నల ఐ డి మరియు ప్రశ్న రూపం లో ఇవ్వడం జరిగింది.
APPSC SET Q.NO : 1
Vyoma Test Series Question : రీటా బరన్ వాల్ అమెరికాలో ఏ సంస్థ ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు?
ans-c
a) మానవ హక్కులు b) మహిళా సంఘం c) అణుశక్తి d) ఏదీకాదు
APPSC SET A Q.NO : 8
Vyoma Test Series Question : ( qid – 87538 ) ఈ క్రింది శిఖరాలను, పర్వత శిఖరాలను జతపరచండి:
a) గురుశిఖర్ 1) జాస్కర్
b) దూప్ ఘర్ 2) సాత్పురా
c) దొడబెట్ట 3) నీలగిరి
d) నంగా ప్రభాత్ 4) ఆరావళి [Ans: a]
(A) a-4, b-2, c-3, d-1 (B) a-3, b-2, c-1, d-4 (C) a-1, b-3, c-2, d-4 (D) a-2, b-3, c-4, d-1
APPSC SET A Q.NO : 12
Vyoma Test Series Question : పులిచింతల ప్రాజెక్ట్ కు గల మరొక పేరు ఏమిటి?[Ans: b]
(A) కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్ట్ (B) కానూరి లక్ష్మణ్ రావు ప్రాజెక్ట్ (C) రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ (D) ఇందిరా సాగర్ ప్రాజెక్ట్
APPSC SET A Q.NO : 81
Vyoma Test Series Question : Qid:110761 ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి?
1. 73వ రాజ్యాంగసవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏక రీతి వ్యవస్థ రూపుదిద్దుకుంది.
2. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం గా జరుపుకుంటారు.[Ans: c]
(A) 1 మాత్రమే (B) 2 మాత్రమే (C) 1, 2 (D) ఏదికాదు
APPSC SET A Q.NO : 100
Vyoma Test Series Question : ( qid – 100255 ) క్రింది వానిలో సరైనవి?
a) AP పంచాయతి రాజ్ చట్టం 1994 ప్రకారం సెక్షన్ 53(1) ద్వారా గ్రామ పంచాయతి గుండాపోవు ఏ రోడ్డు పైనైనా గల ఆక్రమాలను తొలగించే అధికారం గ్రామ పంచాయతికి కలదు.
b) జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం మార్గదర్శకాల ప్రకారం గ్రామంగా ప్రతి ఇంటికి 500మీ. కన్నా తక్కువ దూరంలో “త్రాగునీటి” సౌకర్యం కల్పించాలి.[Ans: a]
(A) a, b (B) a only (C) b only (D) None
APPSC SET A Q.NO : 101
Vyoma Test Series Question : ( qid – 107235 ) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి సరిఅయినవి గుర్తించండి?
1. 2019 మధ్యంతర బడ్జెట్ లో భాగంగా దీని ప్రారంబించారు.
2. కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోని ఏడు ఎకరాల లోపు వ్యవసాయ భూమి గల వారికీ వర్తింపచేసారు.
3. మొత్తం 6 వేల రూపాయలను రెండు విడతలుగా రైతులకు అందిస్తారు.[Ans: a]
(A) 1 మాత్రమే (B) 2 మాత్రమే (C) 1, 3 (D) 1, 2, 3
Explanation: 2 – కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోని ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి గల వారికీ వర్తింపచేసారు.
3 – మొత్తం 6 వేల రూపాయలను మూడు విడతలుగా రైతులకు అందిస్తారు.
APPSC SET A Q.NO : 108
Vyoma Test Series Question : ( qid – 95364 ) ‘మహిళ రక్ష’ పథకానికి సంబంధించి సరికానివి?
a) 2017 ఆగష్టు లో ప్రాంరంభించారు.
b) మహిళ, బాలికల రుతుక్రమ సమయంలో తలెత్తే సమస్యల నివారణ ప్రచార ఉద్దేశం .
c) దానిలో భాగంగా శానిటరీ పాడ్స్ 70% రాయితీ అందించడం.[Ans: d]
(A) a only (B) a, b (C) a, b, c (D) a, c
Explanation: a) 2018
b) 50%
APPSC SET A Q.NO : 112
Vyoma Test Series Question : ( qid – 106201 ) ఆంధ్రప్రదేశ్ లో మిషన్ అంత్యోదయ కు సంబంధించి సరైనవి గుర్తించండి?
1) ఈ పథకం కింద రాష్ట్రంలో 2484 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయడం జరిగింది.
2) దీనిలో ఎక్కువ గ్రామ పంచాయతీలు ఎంపిక అయిన జిల్లా – శ్రీకాకుళం [Ans: b]
(A) 1 మాత్రమే (B) 2 మాత్రమే (C) 1 & 2 (D) None
Explanation: 1 – ఈ పథకం కింద రాష్ట్రంలో 2584 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయడం జరిగింది.
APPSC SET A Q.NO : 114
Vyoma Test Series Question : ( qid – 106237 ) మౌలిక సదుపాయాల కల్పన ఆధారంగా గ్రామ పంచాయతీలకు స్టార్ రేటింగ్ పద్దతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, 2018 డిసెంబర్ నాటికీ 8 స్టార్ రేటింగ్ ను పొందిన పంచాయతీల సంఖ్య?(శ్వేత పత్రం ఆధారంగా)[Ans: a]
(A) 8 (B) 10 (C) 12 (D) 14
APPSC SET A Q.NO : 116
Vyoma Test Series Question : 2019—20 రాష్ట్ర మధ్యంతర బడ్జెట్ లో వ్యవసాయరంగానికి కేటాయించిన మొత్తం
1.12,732 కోట్లు
2.12,632 కోట్లు
3.12,862 కోట్లు
4.12,982 కోట్లు ans -1
APPSC SET A Q.NO : 119
Vyoma Test Series Question : ( qid – 106357 ) పారిస్ లో జరిగిన పీస్ ఫోరంలో AP లో ఏ పథకానికి గ్లోబల్ అవార్డు లభించింది? [Ans: c]
(A) RTGS (B) ఉచిత సూక్ష్మ పోషకం (C) ప్రకృతి సేద్యానికి ప్రోత్సహం (D) పౌర సరఫరాల సేవా విభాగం
Explanation: ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం కొరకు అజా ప్రేమ్ జా ఫౌండేషన్ రూ. 100కోట్లు సాయానికి ముందుకొచ్చింది.
APPSC SET A Q.NO : 129
Vyoma Test Series Question : ( qid – 94238 ) సమాజంలో వివిధ వర్గాల యొక్క సంక్షేమం వికాసం కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టి నిర్ణయఫలితాలను ప్రయోజనాలను చేకూర్చే సంస్థలను ఏమంటారు?[Ans: c]
(A) ప్రభుత్వ సంస్థలు (B) ప్రభుత్వ, ప్రైవేటు ఉమ్మడి సంస్థలు (C) సమాజ ఆధారిత సంస్థలు (D) ప్రైవేటు సంస్థలు
Explanation: సమాజ ఆధారిత సంస్థలను కమ్యూనిటి వర్క్, కమ్యూనిటి డెవలప్మెంట్, కమ్యూనిటి సమీకరణ అనే పదాలు కూడ వాడుకలో వున్నాయి.
Disconfirm
3) ( qid – 94240 ) సమాజ ఆధారిత సంస్థల లక్షణాలను పేర్కొనుము?
ఎ) సమాజ అవసరాలపై విస్తృత అవగాహన కలిగి వుంటాయి.
బి) సాధారణంగా లాభాపేక్ష రహితంగా పని చేస్తాయి.
సి) కమ్యూనిటి ప్లానింగ్, కమ్యూనిటి యాక్షన్ కమ్యూనిటి మొబిటైజేషన్ అనే ప్రాతిపదికలపై పని చేస్తాయి.[Ans: c]
(A) ఎ,బి సరి అయినవి (B) బి,సి సరి అయినవి (C) ఎ,బి,సి సరి అయినవి (D) ఎ,బి,సి సరి అయినవి కావు
APPSC SET A Q.NO : 136
Vyoma Test Series Question : ( qid – 89031 ) చంద్రన్న భీమా యోజనకు సంబంధించి క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తింపుము?
1) దీని ప్రకారం పాలసీ దారులకు పాక్షిక అంగవైకల్యమునకు 3,62,500/- పరిహారం ఇవ్వబడును.
2) చంద్రన్న భీమా 3వ సంవత్సర కాలపరిమితి 2018 ఏప్రిల్ 30 నుంచి 2019 ఏప్రిల్ 29 వరకు.[Ans: a]
(A) 1 only (B) 2 only (C) Both 1 and 2 (D) Neither 1 Nor 2
Explanation: – పూర్తి అంగవైకల్యము: రూ. 5 లక్షలు/-
పాక్షిక అంగవైకల్యము: రూ. 3,62,500/-
సహజ మరణం : 30,000/-
– చంద్రన్న భీమా 3వ సంవత్సర కాలపరిమితి : 2018 మే 31 నుంచి 2019 మే 30 వరకు.
APPSC SET A Q.NO : 140
Vyoma Test Series Question : qid – 104338 జిల్లా పరిషత్ మార్కెట్ ల నుండి వచ్చు ఆదాయంలో ఎంత శాతం ఆదాయం సంబంధిత గ్రామ పంచాయతీకి చెందును?[Ans: c]
(A) 20% (B) 33% (C) 37.5% (D) 25%
APPSC SET A Q.NO : 145
Vyoma Test Series Question : (qid – 109158 ) గ్రామ పంచాయితీ పరిధిలో జరిగే ఆస్థుల క్రయ, విక్రయాలపై వసూలు చేసే స్టాంపు డ్యూటీపై 2 శాతం సర్‌చార్జ్ విధించ బడుతుంది. దీనిని తగిన నిష్పత్తిలో గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు ఈ క్రింది వారిలో ఏ అధికారి 3 నెలల కొకసారి కేటాయిస్తారు………[Ans: c]
(A) సంబంధిత యం.ఆర్.ఒ (B) సంబంధిత వి.ఆర్.ఒ (C) సంబంధిత సబ్‌రిజిస్ట్రారు (D) సంబంధిత ఆర్.డి.ఒ
APPSC SET A Q.NO : 147
Vyoma Test Series Question : ( qid – 100335 ) పంచాయతి రాజ్ సంస్థల అకౌంట్లు క్రింది వానిలో దేని ఆధారంగా ఉంటాయి? [Ans: d]
(A) సింగిల్ ఎంట్రీ పద్ధతి (B) క్రిస్ క్రాస్ పద్ధతి (C) అనువైన పద్ధతి (D) డబుల్ ఎంట్రీ పద్ధతి
APPSC SET A Q.NO : 148
Vyoma Test Series Question : ( qid – 109192 ) పంచాయితీరాజ్ సంస్థలలో మోడల్ అకౌంటింగ్ పద్దతి కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ వారి సహకారంతో ఈ క్రింది అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ని పంచాయితీరాజ్ శాఖలో ప్రవేశపెట్టారు………[Ans: c]
(A) భారత్ సాఫ్ట్ (B) ప్రియాన్ సాఫ్ట్ (C) ప్రియా సాఫ్ట్ (D) మోడల్ సాఫ్ట్
Explanation: ప్రియా : పంచాయితీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంటిగ్ సాఫ్ట్వేర్
APPSC SET A Q.NO : 149
Vyoma Test Series Question : ( qid – 100189 ) క్రింది వానిలో దేని ద్వారా పంచాయతీలలో వివిధ పథకాల కింద చేపట్టిన అనేక పనుల భౌతిక, ఆర్థిక స్థితిని పర్యవేక్షిస్తారు? [Ans: c]
(A) ఆడిట్ ఆన్ లైన్ (B) ప్రియాసాఫ్ట్ (C) యాక్షన్ సాఫ్ట్ (D) డిజిటల్ పంచాయతి
మిగిలిన ప్రశ్నలు అతి త్వరలో అప్డేట్ చేస్తాం, ప్రశ్నల పై ఎలాంటి సందేహాలు ఉన్న కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి.