Read Highlights of budget 2019 present by the first woman full time finance minister of India – Nirmala Sitaraman.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 05 జులై 2019 న లోక్‌సభలో బడ్జెట్-2019ను ప్రవేశపెట్టారు.ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా ఘనత సాధించిన నిర్మలా సీతారామన్. బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయాన్ని పక్కనబెట్టి బ్రీఫ్ కేస్‌కు బదులుగా ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చారు.
బడ్జెట్-2019 ముఖ్య అంశాలు :
నవీన భారత రూప కల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం. 2014-15తో పోలిస్తే, ఆహార భద్రతకు రెట్టింపు నిధులు.
ఎన్డీయే అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం భారత్ 2.5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా మారింది
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.13కోట్లు
రూ.1,రూ.2,రూ.5,రూ.10,రూ.20 కొత్త నాణేలు తీసుకొస్తాం. చూపు లేని వారు కూడా గుర్తించే విధంగా ఇవి ఉంటాయి
రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
మెట్రో రైలు సర్వీసులు పెరుగుతున్నాయి. మరో 300కి.మీ.ల మెట్రో మార్గానికి అనుమతులు లభించాయి. ఇప్పటివరకూ దేశంలో 657కి.మీ.ల మెట్రో మార్గం ఉంది.
స్వయం సహాయ బృందాలకు కూడా ముద్ర యోజన వర్తింపు . ప్రతి స్వయం సహాయ బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం
ఎంఎస్ఎంఈలకు రూ.కోటి వరకూ రుణ సదుపాయం
బస్ ఛార్జీలు, పార్కింగ్ రుసుములు చెల్లించే విధంగా ఒకే కార్డుకు రూపకల్పన చేస్తున్నాం.
ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్ పథకం తీసుకువస్తాం. దాదాపు 3కోట్ల దుకాణ యజమానులు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే, వార్షిక టర్నోవర్ రూ.1.5కోట్ల కన్నా తక్కువ ఉండాలి.
Download Economic Survey 2018-19 PDF
ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంత్యోదయ పథకం మరింత విస్తరణ
ప్రపంచంలోనే భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది. ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు. అంతరిక్ష ప్రయోగాల ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ.
అందరికీ ఇల్లు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నాం. 1.9కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణ కాలాన్ని 114 రోజులకు తగ్గించాం.
గ్రామాలు, పేదరికం, రైతులే మన గ్రామీణ భారతం. అందుకే గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నాం. 2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్, గ్యాస్ సరఫరా
జీరో బడ్జెట్ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం) ప్రవేశపెడుతున్నాం. ఇందుకోసం ఇప్పటికే అనేకమంది రైతులకు శిక్షణ ఇచ్చాం.
‘జలశక్తి మంత్రిత్వశాఖ’ ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ. ‘హర్ ఘర్ జల్’ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.
స్వచ్ఛభారత్ అభిమాన్ పథకం విజయవంతమైంది. 9.6కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించాం.
81లక్షల గృహాలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథక కింద నిర్మించాం
అక్టోబరు 2నాటికి ఓడీఎఫ్ భారత్‌గా తీర్చిదిద్దాలని ప్రధాని సంకల్పం. మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా దేశం ఇచ్చే కానుక ఇదే
మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన
ప్రపంచంలో టాప్-200 విద్యా సంస్థల్లో 3 భారత విద్యాసంస్థలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు విద్యా సంస్థలకు మరిన్ని నిధులు. స్టడీ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకునే అవకాశం.
బసవేశ్వరుని బోధనల ప్రభావంపై యువతకు శిక్షణ కార్యక్రమం.
ALL you need to know about the India Budget .
నాలుగు కార్మిక న్యాయస్థానాల ఏర్పాటు
స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా కొత్త ఛానల్ . వీటి నిర్వహణ బాధ్యత కూడా స్టార్టప్‌లకే అప్పగింత.
ఇళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం. 256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్
ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ . వీటి వాడకం వల్ల రూ.80వేల కోట్ల విలువైన విద్యుత్ ఆదా
భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్ఆర్ఐలకు ఆధార్‌కార్డులు. భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు.
ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. లక్షా ఐదు వేల కోట్ల ఉపసంహరణ కు నిర్ణయం.
విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తెచ్చే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం ఆ అంశాన్ని జీఎస్టీ మండలి పరిశీలిస్తోంది.
మధ్యతరగతి గృహ రుణాలపై మరికాస్త ఊరట. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు. రూ.45లక్షలులోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ . వడ్డీ రాయితీ రూ.2లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపు
బ్యాంకు ఖాతా నుంచి నగదు ఉపసంహరణ పరిమితి ఏడాదికి రూ.కోటి . రూ.కోటి దాటితే 2శాతం టీడీఎస్. పాన్ నంబర్ లేకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలుకు అవకాశం. పాన్ లేదా ఆధార్ నంబర్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలుకు వెసులుబాటు
రూ.5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిపై సర్‌ఛార్జీ పెంపు
బంగారంపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.50శాతానికి పెంపు
డీజిల్, పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రూ.1 పెంపు.