Telugu Current Affairs May 2 2020 | Vyoma

1,424 total views, 5 views today

తెలుగు కరెంట్ అఫైర్స్ మే 2020

1. ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా జాక్వెలీన్‌ హ్యూగ్స్‌
(ఇక్రిశాట్‌) కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ జాక్వెలిన్‌ డీ అరోస్‌ హ్యూగ్స్ ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌కు చెందిన హ్యూగ్స్‌ మైక్రో బయాలజీ, వైరాలజీల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.
https://vyoma.net/current-affairs/jacqueline-hughes-takes-charge-as-director-general-of-icrisat-12098

2. మణిపూర్‌ బ్లాక్‌రైస్‌కు భౌగోళిక సూచిక(జిఐ) ట్యాగ్ గుర్తింపు
మణిపూర్‌ బ్లాక్‌ రైస్‌కు అరుదైన గుర్తింపు లభించింది. మణిపూర్‌ బ్లాక్‌రైస్‌ భౌగోళిక సూచిక(జిఐ) ట్యాగ్‌ పొందినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. మణిపూర్‌ బ్లాక్‌ రైస్‌కు జిఐ ట్యాగ్‌ ఇవ్వాలంటూ మణిపూర్ లోని చాఖావో (బ్లాక్ రైస్) కన్సార్టియం ప్రొడ్యూసర్స్ ఏడాది కిందట దరఖాస్తు చేసింది.
https://vyoma.net/current-affairs/manipur-black-rice-chak-hao-gets-gi-tag-12097

3. ఫుట్‌బాల్ క్రీడాకారుడు చుని గోస్వామి కన్నుమూత
1962 ఆసియా గేమ్స్ స్వర్ణ విజేత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన లెజెండరీ ఇండియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు చుని గోస్వామి గుండెపోటుతో ఏప్రిల్ 30న కన్నుమూశారు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన గోస్వామి, 1956 నుండి 1964 వరకు ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా భారత్ తరఫున 50 మ్యాచ్‌లు ఆడాడు.
https://vyoma.net/current-affairs/legendary-footballer-chuni-goswami-passes-away-12096

4. జార్ఖండ్ తన వలస కార్మికులను రైలు ద్వారా తిరిగి తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా అవతరించింది
తెలంగాణ నుండి రైలు ద్వారా వలస వచ్చిన కార్మికులను తిరిగి తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా జార్ఖండ్ అవతరించింది. లాక్‌డౌన్‌ వల్ల చిక్కుకుపోయిన వలస కార్మికులు ప్రత్యేక రైలులో వారి స్వస్థలాలకు తరలివెళ్లారు.
https://vyoma.net/current-affairs/jharkhand-becomes-first-state-to-bring-back-its-migrant-workers-by-train-12095

5. అజయ్ తిర్కీ WCD మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియామకం
అజయ్ తిర్కీ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అజయ్ తిర్కీ మధ్యప్రదేశ్ కేడర్ నుండి 1987 బ్యాచ్ ఐఎఎస్ అధికారి.
https://vyoma.net/current-affairs/ajay-tirkey-assumes-charge-as-secretary-of-wcd-ministry-12094

6. హ్యాండ్ శానిటైజర్లను తయారు చేయనున్న ఏషియన్ పెయింట్స్,
భారతదేశపు అతిపెద్ద పెయింట్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్, మే 1న వైరోప్రొటెక్ బ్రాండ్ క్రింద చేతి మరియు ఉపరితల శానిటైజర్లను తయారు చేయడం ప్రారంభిస్తుందని ప్రకటించింది. వచ్చే వారం నుండి శానిటైజర్లను మార్కెట్లో అందుబాటులో ఉంచనున్నారు.
https://vyoma.net/current-affairs/asian-paints-to-make-hand-sanitisers-12093

7. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్‌ బజాజ్‌
తరుణ్ బజాజ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా May మే 1న బాధ్యతలు స్వీకరించారు. ఇంతక్రితం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. తరుణ్ బజాజ్ 1988 బ్యాచ్ IAS అధికారి.
https://vyoma.net/current-affairs/tarun-bajaj-appointed-as-economic-affairs-secretary-12092

8. క‌రోనా వైర‌స్‌ టీకా ఉత్పత్తికి హెస్టెర్‌తో ఐఐటీ గువాహటి ఒప్పందం
క‌రోనా వైర‌స్‌ను నిరోధించ‌డానికి టీకాను అభివృద్ధి చేయడానికి ఐఐటీ గువాహటి, అహ్మదాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెస్టెర్‌ బయోసైన్సెస్ ఒప్పందం చేసుకున్నాయి. రికాంబినంట్‌ ఏవియన్‌ పారామిక్సోవైరస్‌ సంబంధిత సాంకేతికత ఆధారంగా ఈ సంస్థలు టీకాను అభివృద్ధి చేయనున్నాయి.

https://vyoma.net/current-affairs/iit-guwahati-collaborates-with-hester-biosciences-to-develop-corona-vaccine-12091

9. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషీకపూర్‌ కన్నుమూత
ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్ ఆస్పత్రిలో ఏప్రిల్ 30న తుదిశ్వాస విడిచారు.
https://vyoma.net/current-affairs/rishi-kapoor-veteran-hindi-actor-passes-away-12090

10. బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ ఇకలేరు
బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ (54) గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ఆయన.. ఏప్రిల్ 29న ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు.
https://vyoma.net/current-affairs/bollywood-actor-irrfan-khan-no-more-12089

11. ఐక్యరాజ్యస‌మితిలో భారత శాశ్వత ప్రతినిధిగా తిరుమూర్తి
ఐక్యరాజ్య సమితి (యూఎన్‌)లో భారత శాశ్వత ప్రతినిధిగా టీఎస్‌ తిరుమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు తిరుమూర్తిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తిరుమూర్తి విదే శీ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీగా పని చేస్తున్నారు.
https://vyoma.net/current-affairs/tirumurti-appointed-indias-representative-to-the-un-12088

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.