సచివాలయ ఉద్యోగాల ఆఫీషియల్ నోటిఫికేషన్

3,061 total views, 2 views today

Official Notification for Grama Sachivalayam 2020

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి గాను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ జనవరి 10 2020 న నోటిఫికేషన్‌ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం (11 జనవరి 2020)నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. అభ్యర్థులు జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. క్రితం నోటిఫికేషన్లలో ప్రకటించిన విద్యార్హతలే ఇప్పుడు కూడా అవే వర్తిస్తాయని అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు. అయితే ఇంకా నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాలలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11.01.2020
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 31.01.2020 

clip

 

Official Link for Grama Sachivalayam Application

http://gramasachivalayam.ap.gov.in/

http://wardsachivalayam.ap.gov.in/

http://vsws.ap.gov.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.