పెథాయ్‌‌కు ఆ పేరు ఎవరు పెట్టారు ? తుఫాన్ పేర్ల వెనుక అసలు కథ ఇదే

567 total views, 1 views today

Original story behind the typhoon names

పెథాయ్‌‌కు ఆ పేరు ఎవరు పెట్టారు ?

తుఫాన్ పేర్ల వెనుక అసలు కథ ఇదే

తుఫాన్‌లకు పేర్ల పెట్టకపోవడం వల్లే వాటి గురించి వార్తల్లో రాయాలన్నా, చర్చించాలన్నా ఇబ్బందికర పరిస్థితుల తలెత్తుతాయి. పలానా సంవత్సరం అని చెప్పినా అందులో స్పష్టత ఉండదు. ఇక ఒకే సంవత్సరంలో రెండు మూడు తుఫాన్‌లు వస్తే మరింత గందరగోళం ఉంటుంది. తుఫాన్‌ల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే తుఫాన్‌లకు పేర్ల పెట్టాలని హిందూ మహాసముద్ర తీర దేశాలు నిర్ణయించాయ
పెథాయ్‌‌కు ఆ పేరు ఎవరు పెట్టారు?తుఫాన్ పేర్ల వెనుక అసలు కథ ఇదే

బంగాళాఖాతంలో వరుస తుఫాన్‌లు తూర్పు తీరాన్ని గజగజా వణికిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో తిత్లీ విధ్వంసాన్ని మరవకముందే..తమిళనాడులో గజ బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే..మరో తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరో 24 గంటల్లో తుఫాన్‌గా మారబోతోంది. ఐతే ఈ తుఫాన్‌కు పెథాయ్‌గా థాయ్‌లాండ్ నామకరణం చేసింది. హుద్ హుద్, తిత్లీ, గజ, పెథాయ్..తుఫాన్‌లకు ఈ పేర్లకు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు తుఫాన్‌లకు పేర్లు ఎందుకు పెడతారు?అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్ల వచ్చే తుఫాన్‌లకు 1953 నుంచే పేర్లు పెడుతున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ పని చేస్తుంది. కానీ దక్షిణాసియా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తుఫాన్‌లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి ప్రారంభమైంది. అంతకు ముందు హిందూ. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు. అవన్నీ అనామకంగానే మిగిలిపోయాయి.

2004లో WMO ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ పాల్గొని ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి. మొత్తం 8 దేశాలు తలో 8 పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను రూపొందించారు.ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం లిస్టులో బంగ్లాదేశ్ సూచించిన పేరు మొదటి స్థానంలో ఉంది. దాంతో 2004 అక్టోబరులో హిందూ మహాసముద్రంలో వచ్చిన తుఫాన్‌కు బంగ్లాదేశ్ సూచించిన ఒనిల్ పేరు పెట్టారు. అదే ఏడాది అరేబియా సముద్రంలో వచ్చిన తుఫాన్‌కు భారత్ సూచించిన అగ్ని పేరు పెట్టారు. ఇక ఏపీని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుఫాన్‌కు..ఆ పేరును పాకిస్తాన్ పెట్టింది. మొన్న వచ్చిన తిత్లీకి సైతం పాకిస్తానే నామకరణం చేసింది. ఐతే 8 దేశాలు సూచించిన 64 పేర్ల జాబితాలో ఇప్పటి వరకు 56 పేర్లను వాడేశారు. పెథాయ్ తుఫాన్ 56వ స్థానంలో ఉంది. మరో 8 తుఫాన్‌లు వస్తే ఆ జాబితాలోని పేర్లన్నీ పూర్తవుతాయి. అనంతరం మరోసారి సమావేశమై కొత్త లిస్టును రూపొందించే అవకాశముంది.

తుఫాన్ పేర్ల వివరాలు
బంగ్లాదేశ్
ఒనిల్ ఒగ్ని నిషా గిరి హెలెన్ చపల ఓక్కీ ఫని
ఇండియా
అగ్ని ఆకాశ్ బిజిలీ జల్ లెహర్ మేఘ్ సాగర్ వాయు
మాల్దీవులు
హిబరు గోను ఆలియా కీలా మాది రోను మకును హిక్కా
మయన్మార్
ప్యార్ యెమిన్ ప్యాన్ థానె నానోక్ కయాంత్ దయే కయాబ్
ఒమన్
బాజ్ సిదర్ వార్డ్ ముర్జాన్,నాడా లుబాన్ మహా
పాకిస్తాన్
ఫనూస్ నర్గీస్ లైలా నీలం నీలోఫర్ వార్దా తిత్లీ,బుల్‌బుల్,హుద్ హుద్.
శ్రీలంక
మాలా రష్మి బంధు మహాసేన్ ప్రియా అసిరి గజ సోబా
థాయ్‌ల్యాండ్
ముక్దా ఖైముక్ ఫేట్ ఫైలిన్ కోమెన్ మోరా  పెథాయ్  ఆంఫాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.