Telangana Budget 2018- Highlights of Telangana Budget 2018-19

Telangana Budget 2018- Highlights of Telangana Budget 2018-19

Telangana Budget 2018- Highlights of Telangana Budget 2018-19

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 1,74,453.84 కోట్లు

Telangana Budget 2018- Highlights of Telangana Budget 2018-19

రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సభలో మంత్రి ఈటల చదివి వినిపించారు. బడ్జెట్ ప్రసంగం పాఠం మొత్తం ఒక గంట 20 నిమిషాల పాటు కొనసాగింది. ఆర్థిక మంత్రి ఈటల.. ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే.
ఈ బడ్జెట్లో సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయ, విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేశారు. గురుకులాలకు అత్యధికంగా నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించి.. అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని ఈటల స్పష్టం చేశారు. గర్భిణీల సంక్షేమంతో పాటు మహిళా శిశు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు.

2018-19 వార్షిక బడ్జెట్‌ మొత్తం రూ.లక్షా 74వేల 453కోట్లు
రెవిన్యూ వ్యయం రూ.లక్షా 25వేల 454కోట్లు
క్యాపిటల్‌ వ్యయం రూ.33వేల 369కోట్లు
రాష్ట్ర ఆదాయం రూ.73వేల 751కోట్లు                                      

Current Affairs Magazine March 2018
Telugu Monthly Current Affairs e-Magazine March-2018 Download as PDF FREE

కేంద్రం నుంచి వచ్చే ఆదాయం రూ.29వేల 41కోట్లు
రెవిన్యూ మిగులు రూ.5,520కోట్లు

  • నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించాం
  • రాష్ట్ర జీడీపీ ఏటేటా పెరుగుతోంది
  • ఈ ఏడాది వృద్ధి రేటు 10.4గా ఉంటుందని అంచాన
  • తయారీ రంగంలో వృద్ధి రేటు 7.5శాతం
  • గత ఏడాది తలసరి ఆదాయం రూ.1,75,534 గతే ఏడాది

వ్యవసాయం

  • రైతుపెట్టుబడి సాయం 2018-19 నుంచి ప్రారంభం.
  • ఎకరానికి రూ.8000 పెట్టుబడి సాయం
  • రైతు సమన్వయ సమితీల ఏర్పాటు
  • 100 రోజుల్లోనే భూరికార్డుల ప్రక్షాళన పూర్తి
  • త్వరలో ధరణి వెబ్‌సైట్‌ ఆవిష్కరణ
  • రైతుల పెట్టుబడి సాయానికి రూ.15వేల కోట్లు
  • రైతులబీమాకోసం రూ.500కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522కోట్లు
  • కోల్డ్‌ స్టోరేజీ, లింకేజీలకు రూ.132కోట్లు
  • బిందు, తుంపర సేద్యానికి రూ.150కోట్లు
  • పాలీ గ్రీన్‌ హౌస్‌కు రూ.120కోట్లు

నీటి పారుదల/విద్యుత్‌ రంగం

  • నీటి పారుదల రంగానికి రూ.25వేల కోట్లు
  • మిషన్‌ భగీరథకు రూ.1,801కోట్లు
  • విద్యుత్‌శాఖకు రూ.5,650కోట్లు
  • విద్యుత్‌ రంగంలో అనూహ్య ప్రగతి సాధించాం
  • గత జనవరి నుంచి 24గంటల విద్యుత్‌ ఇస్తున్నాం

విద్యారంగం

  • విద్యాశాఖకు రూ.10,830కోట్లు
  • గురుకుల పాఠశాలలకు రూ.2,828కోట్లు
  • ఇప్పటి వరకు 27,588 ఉద్యోగాలను భర్తీ చేశాం.
  •  80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది

సంక్షేమ రంగం

  • మహిళా శిశు సంక్షేమానికి రూ.1,799కోట్లు
  • షాదీ ముబారక్‌, కల్యాణ లక్ష్మీ పథకాలకు రూ.1450కోట్లు
  • డబుల్‌ బెడ్‌ రూం.ఇళ్లకు రూ.2,643కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ.2,946కోట్లు
  • ఆసరా పెన్షన్లకు రూ.5000కోట్లు
  • ఎస్సీల అభివృద్ధికి రూ.16వేల 753కోట్లు
  • ఎస్టీలకు రూ.9000కోట్లు పైనే
  • దళితులకు భూపంపిణీకి రూ.1,469కోట్లు
  • మైనార్టీల సంక్షేమానికి రూ.2000కోట్లు
  • రజకుల ఫెడరేషన్‌కు రూ.200కోట్లు
  • నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.250కోట్లు
  • బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100కోట్లు
  • జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75కోట్లు
  • న్యాయవాదుల సంక్షేమానికి రూ.100కోట్లు
  • బీసీ సంక్షేమానికి రూ.5,920 కోట్లు
  • ఎస్సీల సంక్షేమానికి రూ.12,603కోట్లు
  • ఎస్టీల సంక్షేమానికి రూ.8,063 కోట్లు
  • గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం రూ.561కోట్లు
  • ఎంబీసీ సంక్షేమానికి రూ.1000కోట్లు

గ్రామీణం / పట్టణం / పరిశ్రమలు

  • పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.15,563 కోట్లు
  • పట్టణాభివృద్ధికి రూ.1,000కోట్లు
  • స్థానిక సంస్థలకు రూ.1500కోట్లు
  • వరంగల్‌కు 300కోట్లు
  • సాంస్కృతిక రంగం రూ.58కోట్లు
  • చేనేత టెక్స్‌టైల్స్‌కు రూ.1200 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం రంగం రూ.1281కోట్లు
  • ఆర్‌అండ్‌బీశాఖకు రూ.5,575కోట్లు
  • స్థానిక సంస్థలకు రూ.1500 కోట్లు
  • వైద్య ఆరోగ్యశాఖకు రూ.7375కోట్లు
  • పరిశ్రమల రంగానికి రూ.1,286
  • ఐటీ పరిశ్రమకు రూ.289కోట్లు

??Download Full Telangana Budget 2018-19 pdf here

Daily Telugu Current Affairs

Daily  English Current Affairs

Telugu General Essays

Telugu Current Affair Bits