Telugu Current Affairs Highlights 01 May 2018

396 total views, 1 views today

Telugu Current Affairs Highlights 01 May 2018

Telugu Current Affairs Highlights 01 May 2018

>ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ను 2018 సెప్టెంబరు 7 నుంచి 9 వరకు అమెరికాలోని షికాగోలో నిర్వహించనున్నారు.
>2019 ప్రవాసీ భారతీయ దివస్‌ను వారణాసిలో నిర్వహించనున్నారు. 2019 జనవరి 21 నుంచి 23 వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే విదేశీ ప్రతినిధులు అలహాబాద్‌ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి, డిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్ని తిలకించడానికి అవకాశం ఉంటుందని అమెరికాలోని భారత్‌ దౌత్య కార్యాలయ ప్రతినిధి అనురాగ్‌ కుమార్‌ తెలిపారు.
>ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుష్మీ బదులికా యువ శాస్త్రవేత్త అవార్డు-2018 జాబితాలో చోటు దక్కించుకున్నారు.
>ఆంధ్రప్రదేశ్‌ కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‌గా రఘపతుల రామ్మోహన్‌రావును ప్రభుత్వం పునర్‌ నియమించింది
>పాకిస్థాన్‌ మూలాలున్న బ్రిటన్‌ ఎంపీ సాజిద్‌ జావిద్‌(48) 2018 ఏప్రిల్‌ 30న బ్రిటన్‌ కొత్త హోం మంత్రిగా నియమితులయ్యారు
>టోక్యోలో జరిగిన జపాన్‌ జ్ఞాపకశక్తి ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు 20 పతకాలు దక్కాయి. నెల్లూరుకు చెందిన విద్యార్థులు ప్రతిభను చాటారు.
>రాష్ట్రంలో బీసీ విద్యార్థుల బోధన ఫీజు, స్కార్‌షిప్‌లు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.1250 కోట్లు విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈబీసీ) బోధన ఫీజుల కోసం రూ.300 కోట్లు ఇచ్చింది
>ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యులుగా ఐదుగురిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 30న ఉత్తర్వులు జారీ చేసింది. ఐతాబత్తుల ఆనందరావు(తూర్పుగోదావరి), దేవతోటి నాగరాజు(ప్రకాశం), తంగిరాల సౌమ్య(కృష్ణా), వెంకటరాముడు(అనంతపురం), చిల్లంగి జ్ఞానేశ్వరి(విశాఖపట్నం)లు సభ్యులుగా నియమితులయ్యారు.
>తిరుమల, తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి 2018 ఏప్రిల్‌ 30న ప్రమాణ స్వీకారం చేశారు
>యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌, గేమింగ్‌, కామిక్స్‌ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 2018-2020 విధానానికి సంబంధించి మార్గదర్శకాలు 2018 ఏప్రిల్‌ 30న జారీ అయ్యాయి
>డేటా కుంభకోణంలో ప్రధాన కేంద్రంగా ఉన్న కేంబ్రిడ్జ్‌ ఎనలిటికాకు ట్విట్టర్‌ కూడా డేటా అమ్మినట్లు సండే టెలిగ్రాఫ్‌ కథనం పేర్కొంది
>జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర మంత్రివర్గాన్ని 2018 ఏప్రిల్‌ 30న పునర్‌ వ్యవస్థీకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్‌పాల్‌శర్మ, స్పీకర్‌ కోవిందర్‌ గుప్త సహా 8 మంది పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు
>ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఇద్రిస్‌ హసన్‌ లతీఫ్‌ (94) 2018 ఏప్రిల్‌ 30న హైదరాబాద్‌లో మృతి చెందారు
>ఏడాది కిందట అనుకోకుండా పాకిస్థాన్‌లో ప్రవేశించిన ఓ భారతీయుడిని దాయాది దేశం 2018 ఏప్రిల్‌ 29న సురక్షితంగా అప్పగించింది
>దంపతుల మధ్య శృంగార సంబంధం లేకపోతే ఆ ప్రాతిపదికన వారి వివాహం చెల్లుబాటు కాదని ప్రకటించవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది
>CBSE నిర్వహించే పరీక్ష ఫలితాలను విద్యార్థులు నేరుగా గూగుల్‌ సెర్చ్‌ పేజీలో చూసుకునేందుకు ఆ బోర్డుతో చేతులు కలిపినట్లు గూగుల్‌ 2018 ఏప్రిల్‌ 30న వెల్లడించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.