Telugu Current Affairs Highlights 13 April 2018

Telugu Current Affairs Highlights 13 April 2018

Telugu Current Affairs Highlights 13 April 2018

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (PMAY‌) కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడంలో తెలంగాణ రాష్ట్రం చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ వెల్లడించింది.86% పురోగతితో ఛత్తీస్‌గఢ్‌ తొలిస్థానంలో నిలిచింది
ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(BWF) ర్యాంకింగ్స్‌లో భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ అగ్రస్థానంలో నిలిచాడు
భారత్‌లో F/A-18 సూపర్‌ హార్నెట్‌ విమానాలను సంయుక్తంగా తయారు చేయడం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌(HAL), మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్స్‌(MDF)తో అమెరికా సంస్థ బోయింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది
బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ 20వ స్నాతకోత్సవం 2018 ఏప్రిల్‌ 12న నిర్వహించారు
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రకటించారు. రిజర్వేషన్‌ విధానంలో సంస్కరణలు తేవాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని పార్లమెంట్‌లో ఈ మేరకు ప్రకటన చేశారు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి 2018 ఏప్రిల్‌ 12న చేపట్టిన PSLV-C41 వాహకనౌక ప్రయోగం విజయవంతమైంది
భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వరుసగా రెండో ఏడాది కూడా విజ్డెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారానికి ఎంపికయ్యాడు. మహిళ క్రికెట్లో భారత జట్టు సారథి మిథాలీ రాజ్‌ ఇదే అవార్డుకు ఎంపికైంది. అఫ్గానిస్థాన్‌ యువ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ విజ్డెన్‌ ఉత్తమ టీ20 ఆటగాడిగా ఎంపికయ్యాడు.
జలాశయాలు కుంచించుకుపోతుండటంతో భారత్‌, మొరాకో, ఇరాక్‌, స్పెయిన్‌ దేశాలు తీవ్రమైన నీటికొరతతో అల్లాడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.
సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ 2018వ సంవత్సరానికి అసియా పసిఫిక్‌ పారిశ్రామిక పురస్కారానికి (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) ఎంపికయ్యారు
ప్రముఖ న్యూస్‌ వెబ్‌సైట్‌ ద వైర్‌ వ్యవస్థాపక ఎడిటర్‌ సిద్దార్థ్‌ వరదరాజన్‌కు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఇచ్చే ప్రతిష్టాత్మక షోరెన్‌స్టెయిన్‌ జర్నలిజం అవార్డు లభించింది. ఆసియా ప్రాంతంపై చేసిన రిపోర్టింగ్‌కు గాను 2017వ సంవత్సరానికి ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
ఆంధ్రప్రదేశ్‌ ఆపరేషన్స్‌ విభాగం (గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌) అధిపతిగా నళిన్‌ ప్రభాత్‌ నియమితులయ్యారు
21వ కామన్వెల్త్‌ క్రీడల్లో 8వ రోజైన 2018 ఏప్రిల్‌ 12న భారత్‌ 7 పతకాలను సాధించింది.
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఇప్పటివరకు 14 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలు గెలిచింది.
బాలల అపహరణకు సంబంధించిన కేసులను పరిష్కరించే దిశగా భారత్‌ తమతో కలిసి పనిచేయడం ప్రారంభించినట్లు అమెరికా వెల్లడించింది
2014లో కార్యకలాపాలకు స్వస్తి పలికిన పాపుర్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఆర్కుట్‌ మళ్లీ భారత్‌లో ప్రవేశించింది. హ
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నెలకొల్పే స్టార్టప్‌లకు పెట్టుబడులు(ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నుంచి వచ్చినవి సహా) రూ.10 కోట్లలోపు ఉంటే.. పూర్తి స్థాయి పన్ను మినహాయింపును పొందడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
భారత్‌లో మహిళా శ్రామికశక్తి గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, ఉన్నత ఉద్యోగాల్లో లింగ వివక్ష కొనసాగుతూనే ఉందని భారత పరిశ్రమల సమాఖ్య (CII), ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌ (IWN), EYలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది
భారత్‌లో 2016తో పోలిస్తే 2017లో మరణశిక్షలు ఐదో వంతు తగ్గినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆమ్నెస్టీ వెల్లడించింది
అల్‌ఖైదా ఉగ్రవాదికి నిధులు సమకూర్చిన కేసులో భారతీయ ఇంజనీర్‌ ఇబ్రహీం జుబైర్‌ మొహమ్మద్‌(38)కు అమెరికా కోర్టు 5 సం॥ జైలుశిక్ష విధించింది