Telugu Current Affairs One Liners 03 August 2018

Telugu Current Affairs One Liners 03 August 2018

Telugu Current Affairs One Liners 03 August 2018





?శత్రు క్షిపణులను చిత్తుచేసే అధునాతన ‘‘సూపర్‌సోనిక్‌ నిరోధక క్షిపణి’’ పరీక్ష విజయవంతమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన దీన్ని అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ (ఏఏడీ)గా పిలుస్తున్నారు

?యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31 వరకు ప్రవేశపెట్టిన క్షమాభిక్ష పథకం కింద స్వరాష్ట్రానికి రావాలనుకునే కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

?నేర పరిశోధనలో తెలంగాణ పోలీసులకు బ్రహ్మాస్త్రం లాంటి ముఖ కవళికల గుర్తింపు విధానాన్ని(ఎఫ్‌ఆర్‌ఎస్‌) ఆయన 2018 ఆగస్టు 2న ఆవిష్కరించారు

?‘జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌’ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే కీలకమైన బిల్లుకు లోక్‌సభ 2018 ఆగస్టు 2న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది

?అంతరించిపోతున్న కొన్ని ఆదివాసీ జాతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘కేసీఆర్‌ కిట్‌’ నిబంధనలను సడలించింది

?నౌకాదళ ప్రయోజనాల కోసం నిర్మించిన తేలికపాటి యుద్ధ విమానం “తేజస్” ను 02 ఆగష్టు 2018 న విజయవంతంగా పరీక్షించారు.

Click Here For All Competitive exams books

Daily Current Affairs PDF