Telugu Current Affairs One Liners 08 August 2018

Telugu Current Affairs One Liners 08 August 2018

Telugu Current Affairs One Liners 08 August 2018





?భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మంగళవారం జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కే ఎం జోసఫ్‌ల చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు

?ఆరవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ఆస్ర్టేలియా తెలుగు సంఘం, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌, వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ హ్యూస్టస్‌ ఆమెరికా సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్‌ 3, 4 తేదీల్లో మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

?పేద విద్యార్థినులు డిగ్రీ చదివేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకుగాను సంతూర్‌ ‘విమెన్స్‌ స్కాలర్‌షిప్‌’ ప్రోగ్రామ్‌ను విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ అందుబాటులోకి తెచ్చింది

?కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి రచించిన ‘టెన్‌ ఐడియాలజీస్‌’ పుస్తకాన్ని 2018 ఆగస్టు 7న న్యూడిల్లీ లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆవిష్కరించారు

?ఎస్కార్ట్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా నిఖిల్‌ నందా నియామకమయ్యారు. నిఖిల్‌ తండ్రి రాజన్‌ నందా అనారోగ్యంతో మరణించడంతో ఆయన వారసుడిగా ఆ స్థానంలో నియమితులయ్యారు.

?రక్షణ, భద్రత అవసరాల కోసం స్వాధీనం చేసుకునే స్థిరాస్తులపై పరిహార చెల్లింపు నిబంధనలు మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది.

Click Here For All Competitive exams books

Daily Current Affairs PDF