Telugu Current Affairs One Liners 10 July 2018

Telugu Current Affairs One Liners 10 July 2018

Telugu Current Affairs One Liners 10 July 2018




📌తాజ్‌మహల్‌లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు స్థానిక ముస్లింలను తప్ప ఇతర ప్రాంతాల వారిని అనుమతించొద్దని సుప్రీంకోర్టు 2018 జులై 9న ఆదేశించింది
 
📌శ్రీలంక మూలాలు కలిగిన కెనడా రచయిత, సాంస్కృతిక దిగ్గజం మైకేల్‌ ఆందాజీ రచన ‘ద ఇంగ్లిష్‌ పేషంట్‌’ గోల్డెన్‌ మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌గెలుచుకుంది
 
📌కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 6 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ‘ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌(IOE)’ హోదా కల్పించింది
 
📌రకరకాల HIVఇన్‌ఫెక్షన్ల నుంచి సమర్ధంగా కాపాడగలిగే సరికొత్త వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు తయారుచేశారు. దీనిని వారు ‘మొజాయిక్‌’ వ్యాక్సిన్‌గా పేర్కొన్నారు
 
📌క్రియాశీలక పాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్‌బీ శ్రీహరి(89) 2018 జులై 9న మృతి చెందారు
 
📌ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌గా బొంగు(బ్యాంబూ) బిర్యానీని ప్రచారంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
 
📌దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ శామ్‌సంగ్‌, ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్‌ ప్లాంటును నోయిడాలో నిర్మించింది
 
📌తెలంగాణలో గ్రామపంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కేటాయింపు గరిష్ఠంగా 50 శాతానికి మించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది
 
📌లోకాయుక్త బిల్లుకు తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపింది.
 
📌పోలవరం ప్రాజెక్టు సలహాదారుగా రమేశ్‌బాబును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది