Telugu Current Affairs One Liners 10 May 2018

Telugu Current Affairs One Liners 10 May 2018

Telugu Current Affairs One Liners 10 May 2018

> కోస్టారికా అధ్యక్షుడిగా కార్లోస్‌ అల్వరాడో 2018 మే 8న ప్రమాణ స్వీకారం చేశారు. జర్నలిస్టు అయిన కార్లోస్‌ అల్వరాడో 2018 ఏప్రిల్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్యాబ్రిసియో అల్వారాడో మునోజ్‌పై విజయం సాధించాడు
> ఫిజి ప్రధానిగా పనిచేసిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి మహేంద్ర చౌదరి వి.కె.కృష్ణమీనన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. మహేంద్ర చౌదరి ఫిజిలో లేబర్‌ పార్టీకి చెందిన నాయకుడు
> ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులతో కూడిన ఫోర్బ్స్‌ జాబితాలో చైనా అధ్యక్షుడు ప్రథమ స్థానంలో నిలిచారు.ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్రమోడికి 9వ స్థానం దక్కింది.
> ఆన్‌లైన్‌లో బస్సు సీట్ల రిజర్వేషన్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)తో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది
> ప్రపంచవ్యాప్తంగా 2018 మే 8న వరల్డ్‌ రెడ్‌క్రాస్‌ రెడ్‌ క్రెసెంట్‌ డేను నిర్వహించారు. 2018 వరల్డ్‌ రెడ్‌క్రాస్‌ రెడ్‌ క్రెసెంట్‌ డే థీమ్‌ – Memorable smiles from around the world
> 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.4 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) అంచనా వేసింది
> ప్రపంచంలోనే తొలిసారిగా, డాప్లర్‌ సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండా గర్భస్థ శిశువు గుండె సవ్వడిని వినే పరికరాన్ని హైదరాబాద్‌ యువకులు ఆవిష్కరించారు.
> ఆఫ్ఘానిస్థాన్‌-తజికిస్థాన్‌ సరిహద్దుల్లో పర్వత ప్రాంతంలో 2018 మే 9న భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 6.1గా నమోదయింది
> రైలు ఎక్కిదిగే క్రమంలో ఎప్పుడైనా మరణం సంభవించినా లేదా గాయపడినా సదరు ప్రయాణికుడికి పరిహారం పొందే హక్కు కచ్చితంగా ఉందని సుప్రీంకోర్టు 2018 మే 9న స్పష్టం చేసింది
> అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్‌ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కాంగోలో ఎబోలాతో 17 మంది మరణించారు
> ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీ కింద శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)కు దరఖాస్తు చేసుకునే వారు జెండర్‌కు సంబంధించి ఎలాంటి పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ 2018 మే 9న స్పష్టం చేసింది
> రాజస్థాన్‌లో భారత సైన్యం నెల రోజుల పాటు భారీఎత్తున నిర్వహించిన ‘విజయ్‌ ప్రహార్‌’ కసరత్తు 2018 మే 9న ముగిసింది
> చలనచిత్ర ప్రదర్శన రంగంలో 2018 మే 9న సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ రాజధాని డిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేతుల మీదుగా ‘‘మొబైల్‌ డిజిటల్‌ మూవీ థియేటర్‌’ ప్రారంభమైంది
> కూరగాయల చిల్లర ధరలు ఇష్టారాజ్యంగా పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ‘మన కూరగాయలు’ పథకాన్ని రాష్ట్రమంతా విస్తరించాలని తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది
> ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వినిపిస్తోంది.

One thought to “Telugu Current Affairs One Liners 10 May 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.